Begin typing your search above and press return to search.
బాబోయ్ బిగ్ బాస్ అంటున్న నాని
By: Tupaki Desk | 26 Sep 2018 2:36 PM GMTబిగ్ బాస్’ షో అంటే ఏంటో అనుకున్నాడట నాని. కానీ ఈ షో చూశాక తన కళ్లు తెరుచుకున్నాయని అతనంటున్నాడు. ఈ షోను తేలిగ్గా తీసుకున్నానని.. కానీ షో చేస్తుంటే తనకు తత్వం బోధపడిందని అతను చెప్పాడు. ‘‘బిగ్ బాస్ తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని.. ఇంతకుముందు వరకు అందరూ మంచోళ్లే అనుకునేవాడినని.. ఇప్పుడు అభిప్రాయాలు మారాయని.. ప్రపంచం ఇంత కాంప్లెక్సా.. ఇంత కాంప్లికేటెడా.. ఇంత బలమైన నిర్ణయాలా అని ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఈ షో తన కళ్లు తెరిపించిందని.. ప్రపంచం తనకు కొత్తగా పరిచయమైందని నాని అన్నాడు.
‘బిగ్ బాస్’ అయిపోవస్తున్న నేపథ్యంలో మీ ఫీలింగ్ ఏంటి అని ప్రశ్నిస్తే.. ‘‘హమ్మయ్య అయిపోయిందా అనే అనిపిస్తోంది. ఈ మూడున్నర నెలలు చాలా ఒత్తిడితో గడిచాయి. ఓ పక్క సినిమాలు, మరో పక్క బిగ్ బాస్ షో. వారానికి ఒక్క రోజే కదా అని కమిటయ్యా. కానీ షోని వారం రోజుల పాటు ఫాలో కావాల్సి వస్తోంది. ఏడాదికి మూడు సినిమాలు చేసినా.. షెడ్యూల్ మధ్యలో కనీసం 10 రోజులు విరామం వచ్చేది. కానీ ఈ షో చేస్తుండటంతో మూడు నెలల నుంచి ఒక్క పూట కూడా ఖాళీ లేదు. బిగ్ బాస్ అయిపోయాక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి’’ అని నాని అన్నాడు. కౌశల్ ఆర్మీ మీపై.. మీ సినిమాలపై పగ పట్టిందని ప్రచారం జరుగుతోందిగా అని నాని దగ్గర ప్రస్తావిస్తే.. అలాంటి మాటలు తాను నమ్మడం లేదని నాని తేల్చేశాడు.