Begin typing your search above and press return to search.
పాతికేళ్ళు వెనక్కు వెళ్లిన నాని
By: Tupaki Desk | 10 Sep 2018 12:47 PM GMTఎక్కడ చూసినా ఇప్పుడు కేరాఫ్ కంచరపాలెం గురించిన చర్చే కనిపిస్తోంది. ముక్కు మొహం తెలియని నటీనటులతో మహా అయితే కోటి కోటిన్నర మధ్య బడ్జెట్ తో మొత్తం ఒక పల్లెటూరిలో షూటింగ్ జరిపి చిన్నా పెద్ద తేడా లేకుండా అందరితో శభాష్ అనిపించుకుంటున్న దర్శకుడు వెంకటేష్ మహా చుట్టే మీడియా మైకులు ఇంటర్వ్యూ కోసం ప్రదక్షిణ చేస్తున్నాయి. కమర్షియల్ కోణం ఒక్కటి కూడా లేకుండా ఇంతగా మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. అందుకే ట్విట్టర్ ను వేదికగా చేసుకుని సెలెబ్రిటీలు అందరు దీని గురించే ట్వీట్ చేస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని అయితే మరీ ఎగ్జైట్ అవుతున్నాడు. కారణం లేకపోలేదు. విభిన్నమైన కథలతో సహజంగా అనిపించే ట్రీట్ మెంట్ ని బాగా ఇష్టపడే నాని ఆ అభిరుచి కారణంగానే అ!!ని నిర్మించి ప్రశంశలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేరాఫ్ కంచరపాలెం చూసాక పూర్తిగా దాని ప్రేమలో పడిపోయాడు నాని.
దీని గొప్పదనం గురించి వివరిస్తూ ఏకంగా పాతికేళ్లకు పైగా వెనక్కు వెళ్లిపోయాడు. అప్పుడెప్పుడో క్రాంతి కుమార్ గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరావు రావు గారు మీనా పోటాపోటీగా నటించిన గోదావరి కథ సీతారామయ్య గారి మనవరాలు తర్వాత అంత సహజత్వంతో కూడిన కథగా కేరాఫ్ కంచరపాలెం కనిపించిందని నాని మురిసిపోతున్నాడు. అంతే కాదు దీని గురించి ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా తనివి తీరడం లేదని చెబుతున్నాడు.అయినా తనకు ఏ మాత్రం సంబంధం లేని ఒక చిన్న సినిమా గురించి నాని ఇంతగా తాపత్రయ పడటం చూస్తుంటే వెంకటేష్ మహా కష్టం ఫలించినట్టే కనిపిస్తోంది. నాని అనే కాదు విడుదలకు ముందే ప్రీమియర్ షో చూసిన ప్రముఖులు ఎందరో దీని హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రాలేక ట్వీట్లలో తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మొత్తానికి దీనికి అండగా నిలిచి విడుదల విషయంలో సహకరించిన రానా ఇలాంటి సినిమా ద్వారా నిర్మాతగానూ విజయం సాధించి నాన్న వారసత్వాన్ని అందుకున్నాడు.