Begin typing your search above and press return to search.
నాని చెప్పిన మాట.. నేనేం చెప్పలా
By: Tupaki Desk | 14 Feb 2018 4:39 AM GMTటాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు తక్కువనే మాట ఎప్పటి నుంచో ఉన్నదే. ఒకవేళ ఒకటో రెండో వచ్చినా అవి చిన్న సినిమాలే. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు.. హీరోయిన్లు కొత్త తరహా సినిమాలంటే కాస్తంత వెనుకడుగు వేస్తారు. కానీ నాచురల్ స్టార్ నాని దీనికి భిన్నంగా అ! సినిమా నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ బ్యానర్ పై నానియే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు.
అ! సినిమాలో కాజల్ అగర్వాల్.. నిత్య మీనన్.. రెజీనా కెసాండ్రా.. ఈషా రెబ్బా నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో వీళ్లందరివీ డిఫరెంట్ రోల్స్. వీళ్లంతా ఇమేజ్.. గ్లామర్ లెక్కలు చూడకుండా ఈ రోల్స్ చేస్తున్నారు. కేవలం నాని చెప్పడం వల్లనే వాళ్లు దీనికి ఒప్పుకున్నారనే మాట మొదటి నుంచి ఉంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో ఒకేచోటకు వచ్చిన నలుగురు అలాంటిదేం లేదని చెప్పేశారు. కేవలం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన స్టోరీ లైన్ విని ఈ రోల్స్ చేసేందుకు ఓకే చెప్పేశారట. నిత్య అయితే ఏకంగా షూటింగ్ కు ఎప్పటి నుంచి రావాలని అడిగిందని నాని చెప్పుకొచ్చాడు.
ఈ రోల్స్ చేయడానికి నలుగురినీ ఒప్పించాల్సి వస్తుందని ముందు తాను మనసులో అయితే అనుకున్నానని.. కానీ ఆ అవసరమే రాలేదని నాని క్లారిటీ ఇచ్చాడు. కథ విని తానెలా ఇంప్రెస్ అయి సినిమా తీయడానికి ముందుకొచ్చానో.. నటులుగా చేయడానికి వాళ్లు అలాగే ముందుకొచ్చారన్నాడు. మూసతరహా పాత్రలు కాకుండా కొత్తగా ట్రై చేయాలని యాక్టర్లందరికీ ఉంటుందని.. అందువల్లనే వాళ్లంతా ఇష్టంగా ఈ సినిమా చేశారని చెప్పుకొచ్చాడు.