Begin typing your search above and press return to search.
మనోళ్ళు కూడా చేయాలంటున్న నాని
By: Tupaki Desk | 24 Dec 2016 5:45 AM GMTతన కుటుంబం అంతా ''దంగల్'' సినిమాను చూశారని హీరో సల్మాన్ ఖాన్ పేర్కొన్నాడని తెలిసిన విషయమే. పర్సనల్ గా అతనంటే ఇష్టమే కాని ప్రొఫెషనల్ గా ఐ హేట్ యు అంటూ సల్లూ భాయ్ కామెంట్ కూడా చేశాడు. అయితే ఈ కామెంట్లపై మన స్టార్ హీరో నాని కూడా తన తరహాలో రియాక్ట్ అయ్యాడు.
''సినిమా అంటేనే ఆరోగ్యవంతమైన కాంపిటీషన్ ఉండాలి. మన స్టార్లూ సూపర్ స్టార్లూ కూడా ఇలా చేస్తే ఎంతో బాగుండు. మంచి సినిమాలు వస్తాయి'' అంటూ కామెంట్ చేశాడు నాని. అసలు తెలుగులో ఒక్క స్టార్ హీరోకు ఒక్క స్టార్ హీరోకూ పెద్దగా టచ్చనేదే ఉండదు. కేవలం తమ కుటుంబానికి చెందిన హీరోలను పొగుడుకోవడమే తప్పించి ఇతర హీరోల సినిమాల గురించి కాంప్లిమెంట్లు కాఫీ టీలు ఏమీ ఇవ్వరు మనోళ్ళు. శ్రీమంతుడు వంటి గ్రాండ్ సినిమా చేస్తే.. కేవలం రామ్ చరణ్ తప్పించి తెలుగు ఫ్రెటర్నిటీ ఒక్కరు కూడా కాల్ చేయలేదని మహేష్ చెప్పడం చూస్తేనే ఇక్కడ పరిస్థితి ఏంటో అర్ధమైంది. అందుకే నాని అలా ట్వీట్ వేశాడు మరి.
అయితే ఈ మార్పు అనేది ముందుగా నాని వంటి యంగ్ స్టర్స్ మొదలెడితేనే బెటర్. మనోడు కూడా ఇతర స్టార్ హీరోల సినిమాలపై ఇలాంటి రివ్యూలతో కూడిన ట్వీట్లు గట్రా వేస్తే.. వాళ్ళు కూడా మనోడిపై వేస్తుంటారు. కేవలం చిన్న సినిమాలనే ఎంకరేజ్ చేస్తున్న నాని.. త్వరలో రాజమౌళి తరహాలో అందరు పెద్ద స్టార్ల సినిమాలపై ట్వీట్లేస్తాడేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/