Begin typing your search above and press return to search.
ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను నాని దాటేనా?
By: Tupaki Desk | 13 Jan 2019 9:44 AM GMTతెలుగులో ఇప్పటి వరకు క్రీడా నేపథ్యంలో సినిమాలు సక్సెస్ లను దక్కించుకోలేక పోయాయి. వచ్చినవే కొన్ని అయినా కూడా ఆ కొన్ని కూడా తెలుగు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి. హిందీలో వరుసగా క్రీడా నేపథ్యంలో సినిమాలు వస్తూ భారీగా విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంటే తెలుగులో మాత్రం ఆ తరహా సినిమాలు రావడమే గగనం అయ్యాయి, వచ్చినా ఆధరించడం లేదు. ఇలాంటి సమయంలో నాచురల్ స్టార్ నాని క్రికెట్ నేపథ్యంలో 'జెర్సీ' సినిమా చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలుగులో సక్సెస్ ను దక్కించుకోని నేపథ్యంను నాని ఎంపిక చేసుకోవడం కాస్త సాహసంగానే చెప్పాలి. అయితే నానికి ఈ చిత్రంపై చాలా నమ్మకం ఉన్నట్లుగా అనిపిస్తుంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ కు ఈ చిత్రం బాధ్యతలు అప్పగించాడు. తప్పకుండా గౌతమ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకెక్కించి ఇప్పటి వరకు ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ కు స్వస్థి చెప్పడం ఖాయంగా నాని అభిమానులు కూడా నమ్ముతున్నారు.
తాజాగా విడుదలైన నాని 'జెర్సీ' చిత్రం టీజర్ ఆకట్టుకుంటుంది. అన్ని వర్గాల వారికి తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందనిపిస్తుంది. లేటు వయసులో క్రికెట్ ను జీవితంగా ఎంపిక చేసుకున్న వ్యక్తి కథను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. క్రికెట్ ను మాత్రమే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా ఈ చిత్రంలో దండిగా చూపించనున్నట్లుగా అనిపిస్తుంది. ఈ చిత్రం సక్సెస్ అయితే మాత్రం నాని తెలుగు సినీ చరిత్రలో ఒక కొత్త అద్యాయంకు నాంధి పలికిన వాడు అవుతాడు. వచ్చే ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.