Begin typing your search above and press return to search.
జెర్సీ చూస్తే లైవ్ క్రికెట్ చూసినట్టే
By: Tupaki Desk | 9 April 2019 1:30 AM GMTనేచురల్ స్టార్ నాని హీరోగా `మళ్లీ రావా` ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా చిత్రీకరణ సహా నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నామని ఇదివరకూ రిలీజ్ తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ తేదీ గురించి బయట రకరకాలుగా ప్రచారం సాగుతోందని.. అయితే తేదీ మార్పు లేకుండా యథాతథంగా చెప్పిన సమయానికే రిలీజ్ చేస్తున్నామని నిర్మాత వంశీ ప్రకటించారు.
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నాని మాట్లాడుతూ .. ఈ పది రోజుల ప్రమోషనల్ షెడ్యూల్స్ గురించి వివరించారు. ఏప్రిల్ 12న థియేట్రికల్ ట్రైలర్ ని ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నాం. 15న ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహిస్తాం. అటుపై ఏప్రిల్ 19న యథావిధిగా సినిమా రిలీజవుతుంది. రిలీజ్ తేదీలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. జెర్సీ సినిమాతో కొత్త జోనర్ ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. ఫైనల్ ఔట్ పుట్ చూశాం. సినిమా చాలా బాగా వచ్చింది. చెన్నయ్, హైదరాబాద్ లో నిర్మాణానంతర పనులు వేగంగా పూర్తి చేస్తున్నాం. తీరిక లేకపోవడం వల్లనే మీడియాని కలవలేకపోతున్నాం.. అని నాని తెలిపారు. నా కెరీర్ లో మోస్ట్ బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ మూవీ ఇదని నాని జెర్సీ గురించి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పలికే ఈ సినిమాని 20 సార్లు చూశానని, ఇందులో ప్రతి ఎమోషన్.. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన విధానం.. టెక్నికల్ యాస్పెక్ట్స్ ప్రతిదీ ఉత్కంఠ కలిగిస్తాయని నాని తెలిపారు.
క్రికెటర్ అర్జున్ పాత్రలో నటించాను. ఆ పాత్రకోసం ఎంతగానో శ్రమించానని నాని తెలిపారు. ఈ చిత్రంలో నానీని అర్జున్ డామినేట్ చేస్తాడు. సినిమాలోకి వెళ్లాక పూర్తిగా అర్జున్ అనే పాత్రతోనే ప్రేక్షకులు లీనమైపోతారని నాని తెలిపారు. లైవ్ క్రికెట్ చూస్తున్న ఫీలింగ్ ని ఆడియెన్ ఎంజాయ్ చేస్తారని వెల్లడించారు. క్రికెట్ ఆట కోసం ఎన్నో దెబ్బలు తిన్నానని .. ముక్కు విరిగిపోయేలా బంతి తగిలిందని నాని తెలిపారు. క్రికెట్ కోచింగ్ తీసుకున్నా. సినిమాకి సరిపడేంత నేర్చుకున్నా. నేషనల్ టీమ్ లో తీసుకునేంత అని చెప్పలేను కానీ మ్యానేజబుల్ గా నేర్చుకున్నానని నాని తెలిపారు. ఆ క్రమంలోనే ఆట గురించి బోలెడన్ని విషయాలు తెలుసుకునే అవకాశం కలిగిందని అన్నారు.