Begin typing your search above and press return to search.
మళ్లీ టెన్షన్ మొదలైంది -నాని
By: Tupaki Desk | 10 April 2018 5:36 AM GMTటాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా వారనికో పెద్ద సినిమా విడుదలవుతోంది. కొత్త ఏడాది కొంచెం డల్ గా స్టార్ట్ అయినప్పటికీ ఈ మధ్య మాత్రం టాలీవుడ్ లో కొంచెం కొంచెంగా గ్రాస్ పెరుగుతోంది. రంగస్థలం - చల్ మోహన్ రంగ సినిమాలు మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి. అలాగే ఈ సమ్మర్ లో మరో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధమైంది. నాని ద్విపాత్రాభినయంలో నటించిన కృష్ణార్జున యుద్ధం ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో పాల్గొంది. నాని మాట్లాడుతూ.. ప్రతి సినిమా ముందు ఒక టెన్షన్ ఉంటుంది. అలాగే కొంచెం కుతూహలంగా ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేయడానికి కూడా ఒక కారణం ఉంది. తొందరగా ఆ టెన్షన్ కి అలవాటు పడిపోవాలని ఉంటుంది. ఎందుకంటే నార్మల్ అయిపోతుందని అనుకుంటా. కానీ అలా ఏమీ లేదు. ఏ సినిమాకి ఆ సినిమానే మొదటి సినిమా అనిపిస్తోంది. మళ్లీ టెన్షన్ మొదలైంది. బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.
చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించి ఎలాంటి కరెక్షన్స్ చేసినా అక్కడ నేను ఉంటున్నాను. ఎందుకంటే రెండు మూడు సీన్లు అయినా సరే మరోసారి చూడవచ్చని అనిపిస్తోంది. అంత బాగా నచ్చేసింది ఈ సినిమా. సినిమా అందరికి నచ్చుతుందని చాలా నమ్మకంగా ఉంది. ఏప్రిల్ 12న రిలీజ్ కాబోతోన్న కృష్ణార్జున యుద్ధం పక్క ఫ్యామిలి ఎంటర్టైన్ అంటూ నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంతే కాకుండా పైరసీని ఏ మాత్రం ఎంకరేజ్ చేయవద్దని నాని మీడియా ద్వారా కోరాడు.