Begin typing your search above and press return to search.
ప్రతి థియేటర్లో నా సినిమానే అంటున్న నాని
By: Tupaki Desk | 22 Dec 2017 4:41 AM GMTమంచి క్రేజున్న సినిమా వచ్చి చాలా రోజులైంది. ప్రేక్షకులు ఆవురావురుమని ఉన్నారు. పైగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా. ఆయన చేతిలో చాలా థియేటర్లున్నాయి. దీంతో నాని కొత్త సినిమా ‘ఎంసీఏ’కు పెద్ద ఎత్తున థియేటర్లు దక్కాయి. ఈ విషయమై నాని కూడా చాలా ఎగ్జైట్ అయిపోయాడు. తన సినిమా ఇంత పెద్ద ఎత్తున రిలీజవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నాడు. హైదరాబాద్ లో ఎటు చూసినా తన సినిమానే ఆడుతోందని.. ప్రతి థియేటర్లో తన సినిమానే కనిపిస్తోందని.. మల్టీప్లెక్సుల్లో కూడా మాగ్జిమం షోలు ‘ఎంసీఏ’కే ఇచ్చారని నాని అన్నాడు. ఇన్ని థియేటర్లలో సినిమా రిలీజైనా తొలి రోజు అన్ని చోట్లా అన్ని షోలకూ హౌస్ ఫుల్సే అని నాని అన్నాడు.
స్వయంగా తాను చెప్పినా ‘ఎంసీఏ’కు టికెట్లు దొరికే పరిస్థితి లేదని నాని చెప్పడం విశేషం. ‘ఎంసీఏ’ విలన్ విజయ్ వర్మ తనకు మూడు టికెట్లు కావాలని అడిగాడని.. తాను తన మేనేజర్ కు ఫోన్ చేసి అరేంజ్ చేయమన్నానని.. కానీ అతను థియేటరుకు ఫోన్ చేస్తే కుదరదని చెప్పేశారని నాని ‘ఎంసీఏ’ సక్సెస్ మీట్లో తెలిపాడు. తన సినిమా సక్సెస్ అయిందా లేదా.. తాను చేసిన సినిమా కరెక్టా కాదా అన్నది తనకు తొలి రోజు ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్సులో 8.45 షో చూశాక తెలుస్తుందని.. సినిమా ముగియడానికి ఐదు నిమిషాలుండగా.. తాను హడావుడిగా బయటికి వచ్చేసి జనాలకు దొరక్కుండా లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తుకొస్తానని.. ఆ సమయంలో సినిమా రిజల్ట్ ఏంటన్నది తనకు స్పష్టంగా తెలిసిపోతుందని.. ‘ఎంసీఏ’ విషయంలో తనకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందని నాని చెప్పాడు. ఈ సినిమా వసూళ్ల గురించి తాను వింటున్న విషయాలు నమ్మశక్యంగా లేవని నాని తెలిపాడు.