Begin typing your search above and press return to search.
నాని మనసు మార్చుకున్నాడు
By: Tupaki Desk | 9 Feb 2019 6:28 AM GMTన్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ కి ఈ ఏడాది పండగే. ఎక్కువ గ్యాప్ లేకుండా ప్లాన్ ప్రకారం తన సినిమాలను ఒక్కొక్కటిగా నాని లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం జెర్సీ పూర్తి చేసి సెలవులను అమెరికాలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన నాని తిరిగి రాగానే విక్రం కుమార్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ లో జాయిన్ అయిపోతాడు. ముగ్గురు హీరొయిన్లు మరో ఇద్దరు కీలకమైన లేడీ క్యారెక్టర్స్ తో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో ఇది రూపొందుతుందన్న వార్త ఇప్పటికే చక్కర్లు కొడుతోంది.
దీని తర్వాత దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఇది ముందు మల్టీ స్టారర్ అనే వార్త చక్కర్లు కొట్టింది. నాని దుల్కర్ సల్మాన్ ల కాంబోలో తెరకెక్కిస్తామని దిల్ రాజు అన్నట్టు టాక్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడీ ప్లాన్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. మల్టీ స్టారర్ కి బదులు ఇంద్రగంటి వేరే ఫ్రెష్ సబ్జెక్టు తో ముందుకు వస్తున్నారట. లైన్ ఇప్పటికే నాని దిల్ రాజులతో ఓకే అయ్యిందని ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఎలాగూ విక్రం కుమార్ షూటింగ్ లో నాని బిజీగా ఉంటాడు కాబట్టి వేసవి పూర్తయ్యే లోపు ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవాలని చూస్తున్నట్టుగా వినికిడి.
ఇంద్రగంటి నానికి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన దర్శకుడు. అష్టా చెమ్మతోనే నాని సెటిల్ అయ్యాడు. తర్వాత ఈ కాంబినేషన్ లో వచ్చిన డ్యూయల్ రోల్ థ్రిల్లర్ జెంటిల్ మెన్ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. అందుకే హ్యాట్రిక్ మిస్ అవ్వకుండా ఇంద్రగంటి ఓ పకడ్భందీ కథతో సిద్ధమవుతున్నట్టు టాక్. నానివి ఎలాగూ ఈ ఏడాది రెండు సినిమాలు రావడం ఖాయమైపోయింది కాబట్టి దిల్ రాజు సెంటిమెంట్ ని కొనసాగిస్తూ నాని సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుతారేమో చూడాలి