Begin typing your search above and press return to search.
నాని.. ధోనిలా రెచ్చిపోయాడట!
By: Tupaki Desk | 29 July 2015 5:02 AM GMTపేరుకేమో వీడు నాని... రెచ్చిపోతే ధోని... ఎవడెంతటోడైనా గెలవలేడు వీణ్ని. - సినిమాలో హీరో భలే భలే మగాడు అనిపించుకొన్నాడంటే మరి ఈ మాత్రం ఉంటుంది కదండీ. అందుకే నాని రెచ్చిపోయాడు. తన `భలే భలే మగాడివోయ్` సినిమాకోసం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో నాని సరసన లావణ్య త్రిపాఠి నటించింది. మంగళవారంతో చిత్రీకరణ పూర్తయింది. సారథి స్టూడియో లో వేసిన ఓ సెట్ లో నాని, లావణ్యలపై `పేరుకేమో వీడు నాని...` అనే పాటని తెరకెక్కించారు. భాస్కరభట్ల రాసిన ఈ పాటకి శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. సినిమాలో నానితో చిత్రవిచిత్రమైన స్టెప్పులు వేయించారట. అలాగే ఈ పాటనిబట్టి చూస్తే నాని పోషించిన క్యారెక్టర్ పేరు కూడా నాని అనే తెలుస్తోంది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినిమాలో నాని పోషించిన క్యారెక్టర్ ఏంటన్నది తెలియలేదు కానీ... లావణ్య త్రిపాఠి మాత్రం కూచిపూడి నృత్యకారిణిగా కనిపించబోతోందట. స్వతహాగా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, సినిమాలో కూడా డ్యాన్స్ టీచర్ గా కనిపించనుండడం ఎంతో ఆనందాన్నిచ్చిందని లావణ్య చెప్పుకొచ్చింది. మారుతి అయితే ఇదివరకు తాను తీసిన `ప్రేమకథా చిత్రమ్` కంటే రెండు రెట్లు ఎక్కువ వినోదంతో ఈ చిత్రం సాగుతుందని చెబుతున్నాడు. వినోదం అంటే ఇది కేవలం కామెడీ కోసమే తీసిన సినిమా కాదనీ, ఈ సినిమాని ఓ కాన్సెప్ట్ తో తెరకెక్కించాననీ, అందుకు అనుగుణంగానే కామెడీని జోడీడించామని మారుతి స్పష్టం చేశాడు. `కొత్తజంట` తర్వాత మారుతి చాలా విరామం తీసుకొని ఈ సినిమాని చేశారు. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.