Begin typing your search above and press return to search.

నాని చెప్పే పైసల్ ఫిలాసఫీ అదే!!

By:  Tupaki Desk   |   16 Jun 2016 3:30 PM GMT
నాని చెప్పే పైసల్ ఫిలాసఫీ అదే!!
X
రెమ్యూనరేషన్ పెంచారంటగా?? అంటూ ఎటకారంగా ఒక ప్రశ్న. ''ఊరుకోండి సార్‌. అష్టాచమ్మా సినిమాకు ఎంత తీసుకున్నానో ఇప్పుడు కూడా అంతే తీసుకుంటానా ఏంటి?'' అంటూ రిప్లయ్‌. ''జెంటిల్మన్'' సినిమా ప్రమోషన్లలో భాగంగా జరుగుతున్న మీడియా ఇంటరాక్షన్ లో చోటుచేసుకున్న సీన్ ఇది. ఇంతకీ మనోడి పైసల్‌ ఫిలాసఫీ ఏంటో చూడండి.

''అసలు రెమ్యున‌రేష‌న్ పెంచేయడం అంటూ ఏమీ ఉండదు. మన సినిమా స‌క్సెస్ అయినప్పుడు దాని రీచ్ ఎక్కువగా ఉంటుంది. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే నిర్మాత‌లే నా మార్కెట్ ఏంటి, బ‌డ్జెట్ ఏంటనే విష‌యాల‌ను ద‌ష్టిలో పెట్టుకుని వారే ఓ ఫిగర్‌ చెబుతారు. స‌క్సెస్ ఉంటే రెమ్యున‌రేష‌న్ పెరుగుతుంది. స‌క్సెస్ లేకపోతే ఆటోమ్యాటిక్‌ గా త‌గ్గుతుంది. అలాగే అష్టాచ‌మ్మాకి తీసుకునే రెమ్యునరేష‌నే ఇప్పుడ కూడా తీసుకుంటే అందులో అర్థం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు నాని. అంటే బాసూ.. ఏ హీరో కూడా తొలి సినిమాకు తీసుకున్నంత రెమ్యూనరేషన్‌ తరువాత తీసుకోడులే.

విషయం ఏంటంటే.. భలే భలే మగాడివోయ్‌ సినిమా వరకు సింపుల్‌ ఛార్జీలు వడ్డించిన నాని.. ఆ తరువాత మాత్రం ఒక 5 కోట్లు ఉంటే మాట్టాడదాం చెప్పండి అనేస్తున్నాడంట. అది మనోడు నిర్మాతలకు చెబుతున్న పైసల్ ఫిలాసఫీ!!