Begin typing your search above and press return to search.
సినిమాపోతే హీరోలను వేస్ట్ అంటున్నారు
By: Tupaki Desk | 9 Feb 2016 5:57 AM GMTఎవరో కాదు ఆ మాట అనేసింది. స్వయంగా మన న్యాచురల్ స్టార్ నాని ఆ డైలాగ్ కొట్టాడు. కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమా ప్రమోషన్ ను ఎట్టకేలకు మొదలెట్టాడు నాని. ఈ సందర్భంగా మనోడు మీడియాతో మాట్లాడుతూ.. తనను అత్యధికంగా బాధించే ఒక విషయం చెప్పాడు.
''అసలు సినిమా ఫెయిల్ అయిందే అనే బాధకంటే.. ఆ సినిమా పోయినప్పుడు.. ఇక ఈ యాక్టర్ పనైపోయింది. వీడిలో మ్యాటర్ ఓవర్. ఇలా రాస్తుంటారు. ఇది బాగా బాధిస్తుంటుంది. నా వరకు నేను కమర్షియల్ మసాలా సినిమాలను చేయలేను. అలాంటప్పుడు నేను ఫుల్లుగా ఎంటర్ టైన్ మంట్ ఉన్న సినిమాలనే ఎంచుకోవాలి'' అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఒక విధంగా నాని యాంగిల్ లో చూస్తే నాని కరక్టే.
కాని సరైన సినిమాలను ఎంచుకొని హిట్టు కొట్టినా.. ఇదే హీరోలను ఆకాశానికి ఎత్తేసేది కూడా అదే మీడియా. శ్రీమంతుడు హిట్టయితే దర్శకుడు కొరటాల శివ కంటే మహేష్ బాబుకే ఎక్కువ పేరొచ్చింది. ఏ సినిమా అయినా అంతే.. హీరో అనే వాడు ఫేస్ ఆఫ్ ది మూవీ కాబట్టి.. గుడ్ నేమ్ కాని బ్యాడ్ కాని.. అతడికే వస్తుంది మరి. ఏమంటావ్ నాని?