Begin typing your search above and press return to search.

'మజ్ఞూ' ప్రమోషన్లు డల్ గా ఉన్నాయా?

By:  Tupaki Desk   |   19 Sep 2016 5:30 PM GMT
మజ్ఞూ ప్రమోషన్లు డల్ గా ఉన్నాయా?
X
నిజానికి రెండు వారాల ముందే టివి ఛానళ్ళకు ఇంటర్యూలు ఇచ్చేస్తూ హీరో నాని షాకిచ్చాడు. తన ''మజ్ఞూ'' సినిమా సెప్టెంబర్ 23న రిలీజవుతున్న వేళ.. మనోడు ఇలా ముందుగానే హడావుడి చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న కంప్లయింట్ ఏంటంటే.. అసలు నాని సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయట్లేదు అంటున్నారు.

సరే నాని ఇంటర్యూలు ఇస్తున్నాడు, టివిల్లో ట్రైలర్లు వస్తున్నాయి, రేడియోల్లో పాటలు వినిపిస్తున్నాయి.. కాని ఆల్రెడీ సోమవారం కూడా పూర్తయిపోయినా ఇంతవరకు హీరోయిన్లతో కలసి గ్రూపు ఇంటర్యూలు.. ఇద్దరు హీరోయిన్ల ఇంటర్యూలు.. లైవ్ షోలు.. టివిల్లో గేమ్ షోలు.. ఇలాంటి ప్రమోషన్లు జరగట్లేదని కాస్త ఫీలవుతున్నారు మీడియా జనాలు. అయితే నాని మాత్రం.. వాటిని కూడా తన నిర్మాతలతో కలసి పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు అనూ ఎమ్మానుయేల్ అలాగే ప్రియశ్రీ లుదానీ కూడా ప్రమోషన్లతో దంచి కొట్టడానికి రెడీ అవుతున్నారట.

ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ డైరక్షన్లో రూపొందిన 'మజ్ఞూ' సినిమా మ్యూజిక్ ఇప్పటికే పెద్ద హిట్టవ్వడం.. అలాగే కామెడీగా ఉన్న టీజర్లు కూడా చాలా ఆసక్తిని రేకెత్తించడంతో.. ఇప్పటికే సినిమాకు కావల్సినంత హైప్ ఉందిలే.