Begin typing your search above and press return to search.

రిస్కెందుకులే అని నాని తప్పేసుకున్నాడా?

By:  Tupaki Desk   |   3 Dec 2016 7:30 AM GMT
రిస్కెందుకులే అని నాని తప్పేసుకున్నాడా?
X
ఆల్రెడీ ఈ సంవత్సరం మూడు సినిమాలతో దాడి చేశాడు నాని. మూడూ కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. అందుకే హై స్పీడ్ యాక్టర్ అనే అవార్డును కూడా అందుకుంటాడేమో అనే తరహాలో ఇప్పుడు ఏకంగా నాలుగవ సినిమాను కూడా దించాలని ప్లాన్ చేశాడు. కాని అది అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాల రష్ ఎలా ఉందో చూస్తున్నాంగా.

డిసెంబర్ 25న 'నేను లోకల్' సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు అండ్ నాని అనుకున్నారు. కాకపోతే ఇప్పటివరకు ఇంకా సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వలేదు. ఇంత త్వరత్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసేయాలని అంటే కష్టమని దర్శకుడు నక్కిన త్రినాథరావు చెప్పేయడంతో.. నేను లోకల్ ఈ సంవత్సరం రావడం కాస్త కష్టమేనని అర్దమైంది.

అంతే కాదు.. డిసెంబర్ 9న ధృవ.. 16న కొన్ని చిన్న సినిమాలు.. 23న సూర్య సింగం 3.. జనవరిలో వరుసగా గౌతమీపుత్ర శాతకర్ణి.. ఖైదీ నెం 150.. శతమానం భవతి సినిమాలు లాక్ అయిపోయాయ్. అందుకే ఇప్పుడు మధ్యలో వచ్చి అనవసరంగా ధియేటర్లు దొరక్క ఇబ్బందులు పడే బదులు.. నాని ఫిబ్రవరిలో రావడం బెటర్ అని ఫిక్సయిపోయాడట. రిస్కెందుకులే అని ఇలా డిసైడయ్యాడట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/