Begin typing your search above and press return to search.

ఏంటి నాని.. మైండ్ సెట్ చేస్తున్నావా?

By:  Tupaki Desk   |   6 July 2017 12:09 PM GMT
ఏంటి నాని.. మైండ్ సెట్ చేస్తున్నావా?
X
ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు చాలామంది 'నిన్ను కోరి' సినిమా గురించి మాట్లాడుతున్నారులే. గత రాత్రి సెలబ్రిటీ షో వేయడం వలన.. మనోళ్లు ఇప్పుడు ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరో ప్రక్కన నాని కూడా ప్రమోషన్లలో ఈ సినిమా గురించి ఒక ఎమోషనల్ కథంటూ తెగ చెబుతున్నాడు. సాధారణంగా సినిమా కంటెంట్ గురించి సినిమా రిలీజ్ కు ముందు అస్సలు ఏమాత్రం చెప్పని నాని.. ఈసారి ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే ఒక టాక్ వినిపిస్తోంది.

నిజానికి ''నిన్ను కోరి'' సినిమాను పూర్తి స్థాయి ఎమోషనల్ సినిమాగా తీశారట. అయితే ఈ సినిమాలో కామెడీ కంటెంట్ ఎంత ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌ నుండి సినిమా బాగా డ్రామాతో నిండిపోయిందంట. సాధారణంగా బి అండ్ సి సెంటర్లలో ఇలాంటి డ్రామాలు అంతగా నడవవ్. పైగా ఆడియన్స్ గతంలో నేను లోకల్ వంటి సినిమాల్లో కథ లేకపోయినా కామెడీతో నింపేసిన సంగతి చూశారు కాబట్టి.. ఇప్పుడు కూడా అలాంటి అంచనాలే పెట్టుకుని ధియేటర్లకు వస్తే కష్టం. అందుకే నాని ఇప్పటినుండే సినిమాలో ఎమోషన్ ఎక్కువ.. కథ ఎక్కువ.. అంటూ ఆడియన్స్ ఈ సినిమాకు ట్యూన్ అయ్యే విధంగా మైండ్ సెట్ చేస్తున్నాడంటున్నారు సినిమా లవర్స్.

ఇకపోతే హార్ట్ టచ్చింగ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాలను చూస్తుంటాయి. గతంలో నాని హీరోగా వచ్చిన ఎటో వెళ్ళిపోయింది మనస్సు సినిమా పరస్థితి కూడా అంతే. అందుకే ఇప్పుడు నిన్ను కోరి యునిట్ చాలా టెన్షన్ కు లోనవుతోందని తెలుస్తోంది. అసలు ఈ కొత్త దర్శకుడు శివ నిర్వాణ సినిమాను కొత్త వారితో తక్కువ బడ్జెట్ లో చేసేద్దాం అంటే.. నాని ని సీన్లోకి తెచ్చి అమెరికా బ్యాక్ డ్రాపులో సినిమా తీయించింది కోన వెంకటేనట. అందుకే ఇప్పుడు అన్ని కళ్ళూ ఆయన్నే చూస్తున్నాయ్. అది సంగతి.