Begin typing your search above and press return to search.
నాలుగంటే బాగా ఎక్కువమ్మా
By: Tupaki Desk | 25 Feb 2016 1:30 AM GMTనేచురల్ స్టార్ అని బిరుదు దక్కించుకున్నా.. నాని ఇప్పటికి ఇంకా స్టార్ హీరోనా అంటే ఆన్సర్ కొంచెం అంటూ ఇటూగానే ఉంటుంది. ఎందుకంటే.. నానికి ఇంకా లోకల్ గా స్టేబుల్ మార్కెట్ అనేది సెట్ కాలేదు. భలేభలే మగాడివోయ్ తర్వాత ఓవర్సీస్ లో మాత్రం డిమాండ్ బాగానే ఊపందుకుంది. రీసెంట్ గా విడుదలైన కృష్ణగాడి వీర ప్రేమగాధకి మిక్సెడ్ రివ్యూలు, టాక్ వచ్చినా సరే.. ఓవర్సీస్ లో 7లక్షల డాలర్లతో మంచి కలెక్షన్లనే వసూలు చేసింది.
అంటే ఓవర్సీస్ ని నమ్ముకున్న హీరోల్లో నాని ఒకడనే విషయం దీంతో స్పష్టమైపోతోంది. అయితే నాని నెక్ట్స్ సినిమా కోసం నిర్మాతలు అడుగతున్న రేట్ చూస్తే గుండాగిపోతుంది. ఒక్క ఓవర్సీస్ హక్కులకే ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేసేస్తున్నారట. టాలీవుడ్ లో 40 కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాకి కూడా.. ఓవర్సీస్ రూపంలో 4 కోట్లు వచ్చే పరిస్థితి లేదు. కానీ నానితో సినిమా అంటే పట్టుమని 10 కోట్లు కూడా ఖర్చవదు. అలాంటప్పడు ఓవర్సీస్ తోనే సగానికి పైగా రాబట్టాలనే ఆలోచన కరెక్ట్ కాదనే చెప్పాలి.
ప్రస్తుతం నానికి ఉన్న డిమాండ్ ప్రకారం ఇక్కడ 2 కోట్లంటే సరైన రేట్ గా చెప్పాలి. నాలుగు కోట్లు ఇస్తే.. పెట్టుబడిలో సగం రిస్క్ లో పడిపోయినట్లే. అసలే ఓవర్సీస్ లో టెలికాస్టింగ్ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. అలాంటప్పుడు నిర్మాతలకే 4 కోట్లిచ్చే పరిస్థితి లేదని తేల్చేస్తున్నారట ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు.