Begin typing your search above and press return to search.

భలే భలే పాత్రల నాని

By:  Tupaki Desk   |   8 Sep 2018 5:30 PM GMT
భలే భలే పాత్రల నాని
X
న్యాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ 2తో యాంకర్ గా ఋజువు చేసుకున్నాక తిరిగి షూటింగ్స్ లో బిజీ కాబోతున్నాడు. నాగార్జునతో కలిసి చేసిన మల్టీ స్టారర్ దేవదాస్ ఈ నెల 27న విడుదల కానుండగా దీని తర్వాత మళ్ళి రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ టీమ్ తో జాయిన్ అయిపోతాడు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ఇండియన్ క్రికెట్ టీమ్ కోసం ఆడే ఒక మధ్య వయస్కుడిగా నాని పాత్ర విభిన్నంగా ఉంటుందట. తను సెలెక్ట్ అయ్యే విధానమే చాలా ఎంటర్ టైనింగ్ గా తీర్చిదిద్దినట్టు సమాచారం. అంతే కాదు జాతీయ జట్టుకు ఎంపికయ్యే క్రమంలో వచ్చే సాధకబాధలు కొంత హాస్యాస్పదంగా కొంత ఎమోషనల్ గా టచ్ చేసేలా డిజైన్ చేసాడట గౌతమ్. వరల్డ్ కప్ ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. లెజెండరీ క్రికెటర్స్ తో నాని ఉన్నట్టుగా కావాల్సిన సన్నివేశాల కోసం మంచి సిజి వర్క్ కూడా చేయబోతున్నట్టు సమాచారం. వీలున్న వాళ్ళతో రియల్ సీన్స్ కూడా తీస్తారట.

మరోవైపు ఇది కాకుండా నాని స్క్రీన్ ప్లే మెజీషియన్ గా పేరున్న దర్శకుడు చంద్రశేఖర్ ఓలేటితో ఓ సినిమా చేయబోతున్నట్టు గతంలో న్యూస్ వచ్చింది. ఇందులో నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. యేలేటి సినిమాల్లో హీరోలు సాధారణంగా ఉండరు. అనుకోకుండా ఒక రోజులో జగపతి బాబు పాత్రను తీర్చిదిద్దిన తీరు చూస్తే ఇది అర్థమైపోతుంది. నాని లాంటి స్టేచర్ ఉన్న నటుడు కాబట్టి ప్రత్యేకంగా ఇది సెట్ చేసినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియడానికి మాత్రం ఇంకా టైం పట్టేలా ఉంది. జెర్సీతో పాటు ఈ మూవీని షూట్ చేస్తారా లేక పూర్తయ్యాక మొదలుపెడతారా లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది కృష్ణార్జున యుద్ధంతో చిన్న కుదుపు అందుకున్న నాని దేవదాస్ తో ట్రాక్ లో పడతాననే నమ్మకంతో ఉన్నాడు.