Begin typing your search above and press return to search.

ఆమెతో గొడవన్నారు.. తెగ పొగిడేశాడే

By:  Tupaki Desk   |   19 Dec 2017 11:30 PM GMT
ఆమెతో గొడవన్నారు.. తెగ పొగిడేశాడే
X
సాయిపల్లవి లేడీ రాజశేఖర్ అంట.. ‘ఎంసీఏ’ షూటింగుకి ఆమె చాలా లేటుగా వస్తోందట.. నానిని అసహనానికి గురి చేస్తోందట.. సాయి పల్లవి బాగా యాటిట్యూడ్ చూపించడంతో నానితో ఆమెకు గొడవైందట.. కొన్ని రోజులుగా ఇలాంటి రూమర్లు చాలానే వచ్చాయి. సోషల్ మీడియాలో దీని గురించి చాలా పెద్ద చర్చ నడిచింది కూడా. ఐతే మొన్న వరంగల్లో జరిగిన ‘ఎంసీఏ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో నాని-సాయిపల్లవి చాలా ఫ్రెండ్లీగా కనిపించారు. ఏ ఇబ్బందీ లేనట్లే వ్యవహరించారు. ఇప్పుడు ‘ఎంసీఏ’ ప్రమోషన్లలో భాగంగా సాయిపల్లవి మీద ప్రశంసలు కురిపించాడు నాని. ఆమె తన బెస్ట్ కోస్టార్ అని కూడా అతను కితాబివ్వడం విశేషం.

‘‘ఒక హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే ప్రి నోషన్స్ చాలామంది కథానాయికలకు ఉంటాయి. సాయి పల్లవి ఆ కేటగిరీలోకి రాదు. ఆమె ఆమె లాగే ఉంటుంది. తన పెర్ఫామెన్స్ విషయంలో చిన్న చిన్న డీటైల్స్ మిస్ కాకుండా చూసుకుంటుంది. డైలాగులు.. పెర్ఫామెన్స్.. కాస్ట్యూమ్స్.. వీటన్నింటికీ మించి చిన్న చిన్న హావభావాల విషయంలో సాయి పల్లవి తన ప్రత్యేకతను చూపిస్తుంది. మామూలుగా ఇలాంటి చిన్న చిన్న హావభావాల విషయంలో దర్శకుడే అలెర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ సాయిపల్లవి విషయంలో అలాంటి అవసరం లేదు. ఆమెకు అన్ని విషయాలూ దర్శకుడే చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి నటిని నేను ఇంత వరకు చూడలేదు. ఆమె అమేజింగ్ యాక్ట్రెస్’’ అని నాని అన్నాడు.