Begin typing your search above and press return to search.
నానీ ఎస్కేప్ అయ్యాడు.. విజయ్ దొరికేశాడు
By: Tupaki Desk | 16 Feb 2020 5:30 PM GMTహీరోకి కథ చెప్పి ఒప్పించాలంటే అంత ఆషామాషీనా? ఒకటికి పది లాజిక్ లు వెతికితే అన్నిటికీ పక్కాగా సమాధానాలివ్వాలి. అంతా నచ్చినా కొత్త దర్శకులకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం కుదరదు. ఆ క్రమంలోనే ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ ప్రాసెస్ లో హీరోలే మారిపోతుంటారు. అలానే నానీకి తగలాల్సిన జాక్ పాట్ విజయ్ కి గట్టిగానే తగిలేసిందన్నది ఫిలింనగర్ గుసగుస.
ఒకరికి వినిపించిన కథ అక్కడ రిజెక్ట్ అయ్యాక ఇంకొకరికి కనెక్టయ్యింది. అలా విజయ్ కి కనెక్టయినదే `వరల్డ్ ఫేమస్ లవర్`. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ సహా ఆడియెన్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది. విజయ్ - నిర్మాత కె.ఎస్ రామారావు ఈ స్క్రిప్టును ఎంతో బలంగా నమ్మి చేసారు. మరో అర్జున్ రెడ్డిలా నిలిచిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉండేవారు. కానీ తానొకటి తలిస్తే అన్న చందంగా అంచనాలన్నీ తారుమారు అయ్యాయి.
హీరో రైటర్ అవ్వడం.. తన కథల్లో తానే హీరో అని ఊహించుకుని ఊహాలోకంలో తేలిపోవడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. అయితే ఈ స్క్రిప్ట్ ముందుగా నేచురల్ స్టార్ నానికి క్రాంతి మాధవ్ వినిపించారట. ప్రథమార్థం విన్న తర్వాత అటుపై ఇంకా వినేందుకు ఏమాత్రం ఒప్పుకోలేదుట. ఇప్పుడే వచ్చేస్తానంటూ స్కిప్ కొట్టాడని గుసగుస వినిపిస్తోంది. ద్వితియార్థం కథ అసలు నానీ వినకుండా పదే పదే ఎస్కేప్ అయ్యాడట. దీంతో విషయాన్ని గ్రహించిన క్రాంతి మాధవ్ చివరిగా విజయ్ దేరకొండని బుట్టలో వేశారన్న గుసగుసా వినిపిస్తోంది. ఇందులోనూ అర్జున్ రెడ్డి ప్లేవర్ ఉండే సరికి దేవరకొండ తొందరపడి కమిట్ అయ్యాడా? అందుకే ఇలా దొరికిపోయాడా? అంటూ అభిమానులే కామెంట్లు చేయడం వైరల్ గా మారింది. ఏదేమైనా నానీ ఎస్కేప్ అయ్యాడు. విజయ్ దొరికిపోయాడు అంతే!