Begin typing your search above and press return to search.

నాని అన్ని సినిమాలు రిజెక్ట్ చేశాడా?

By:  Tupaki Desk   |   27 March 2016 5:30 PM GMT
నాని అన్ని సినిమాలు రిజెక్ట్ చేశాడా?
X
రెండేళ్ల కిందట ఈ సమయానికి దయనీయమైన స్థితిలో ఉన్నాడు నాని. పైసా.. ఆహా కళ్యాణం సినిమాలు దారుణమైన ఫలితాలు చవిచూడగా.. ‘జెండాపై కపిరాజు’ విడుదలకే నోచుకోని పరిస్థితిలో పడింది. అలాంటి సమయంలో ఏం చేయాలో తోచక దాదాపు పది నెలలు గ్యాప్ తీసుకున్నాడు నాని. ఐతే ఆ గ్యాప్ తర్వాత ‘ఎవడే సుబ్రమణ్యం’ లాంటి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా ఒప్పుకోవడానికి ముందు 80 దాకా కథలు విన్నానని.. అన్నింటినీ రిజెక్ట్ చేశానని నాని స్వయంగా చెప్పడం విశేషం. ఐతే ఫెయిల్యూర్లో ఉన్నపుడే కాదు.. సక్సెస్ లో ఉన్న టైంలోనూ నాని అదే జాగ్రత్తతతో ఉంటున్నాడు.

‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్ బస్టర్ హిట్టవడంతో నానితో సినిమా సినిమా చేయడానికి పేరున్న దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఐతే ఎంత పేరున్న వారైనా సరే.. కథ నచ్చకపోతే సినిమా చేసే ఛాన్సే లేదంటున్నాడు నాని. ఈ మధ్య కాలంలో అతను 16 సినిమాల్ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. మొహమాటానికి పోయి సినిమాలు ఒప్పుకుంటే తన కెరీర్ మళ్లీ ప్రమాదంలో పడుతుందని నాని ఇంత జాగ్రత్త పడుతున్నాడట. గతంలో తగిలిన ఎదురు దెబ్బల్ని దృష్టిలో ఉంచుకున్న తనకు ఏమాత్రం డౌటున్నా ఆ కథను రిజెక్ట్ చేస్తున్నాడట. నాని ఇలా తిరస్కరించిన వాటిలో కొందరు పెద్ద దర్శకులు చెప్పిన కథలు కూడా ఉన్నాయట. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ రొమాంటిక్ థ్రిల్లర్లో నటిస్తున్న నాని.. ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యాడు.