Begin typing your search above and press return to search.

ఆ లెక్కన మహేష్ కంటే నాని రెమ్యూనరేషనే ఎక్కువ!

By:  Tupaki Desk   |   23 Feb 2019 5:42 AM GMT
ఆ లెక్కన మహేష్ కంటే నాని రెమ్యూనరేషనే ఎక్కువ!
X
స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. స్టార్ల రెమ్యూనరేషన్ విషయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే..నిర్మాతలకు వచ్చే లాభనష్టాలతో సంబంధం లేకుండా వారి రెమ్యూనరేషన్లు పైపైకి ఎగబాకుతుంటాయి. టాప్ లీగ్ స్టార్లే కాదు.. మీడియం లీగ్ లో టాప్ పొజిషన్లో ఉన్న న్యాచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్ ఈమధ్య ఒక హాట్ టాపిక్ అయింది.

న్యాచురల్ స్టార్ రెమ్యూనరేషన్ ఎంత ఉండొచ్చని అనుకుంటున్నారు? ప్రస్తుతం చేస్తున్న 'జెర్సీ' సినిమాకు నాని రూ. 10 కోట్లు + ప్రాఫిట్స్ లో 30% షేర్ తీసుకుంటున్నాడని టాక్. 'జెర్సీ' సినిమాకు ఉన్న డిమాండ్ ను బట్టి.. జరిగే బిజినెస్ ను బట్టి ఆ 30% షేర్ దాదాపుగా రూ. 4 కోట్ల వరకూ ఉండొచ్చని సమాచారం. అంటే ఓవరాల్ గా 'జెర్సీ' సినిమాతో నాని రూ. 14 కోట్లు తన పాకెట్లో వేసుకుంటున్నట్టు లెక్క. సినిమా సూపర్ హిట్ అయినా నిర్మాతకు ఈ రేంజ్ రెవెన్యూ ఉంటుందో లేదో తెలియదు.

నాని ఒక సినిమా రెమ్యూనరేషన్ ఇది. సినిమాలు చేయడంలో నాని జెట్ స్పీడ్ అని అందరికీ తెలిసిందే. సంవత్సరానికి నాని మినిమం రెండు సినిమాలు చేస్తాడు. ఒక్కోసారి మూడు సినిమాలు కూడా చేస్తాడు. రెండు సినిమాలు కనుక చేస్తే నాని దాదాపుగా 27 నుండి 28 కోట్లు వస్తాయి. ఇక మూడు సినిమాలైతే దానికి ఇంకో 13-14 కోట్లు కలపాలి. ఈ లెక్కన సినిమాల ద్వారా నాని సంపాదించేది సూపర్ స్టార్ మహేష్ బాబు సంపాదన కంటే ఎక్కువ. ఎందుకంటే మహేష్ ఒక ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం. ఒక్కోసారి సినిమా పూర్తి చేయడానికి ఒకటిన్నర ఏడాది కూడా తీసుకుంటాడు. మహేష్ రెమ్యూనరేషన్ ప్రాజెక్టును బట్టి రూ. 20 నుండి 25 కోట్లు ఉంటుంది. యాడ్స్ ద్వారా మహేష్ కు వచ్చే రెవెన్యూ పక్కనబెట్టి సినిమా రెమ్యూనరేషన్ మాత్రమే చూసుకుంటే ఒక ఏడాదికి సూపర్ స్టార్ కంటే న్యాచురల్ స్టార్ సంపాదించేది ఎక్కువ. నాని గారి వరస అలా ఉంది!