Begin typing your search above and press return to search.
రాజకీయాలు పక్కన పెట్టండి : హీరో నాని
By: Tupaki Desk | 26 Sep 2021 11:49 AM GMTరాజకీయాలకు సినిమా రంగాన్ని ముడిపెడుతూ గత కొంత కాలంగా ఏపీ రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. జనసేనాని.., పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై వున్న కోపంతో యావత్ సినీ ఇండస్ట్రీని ఏపీ సీఎం టార్గెట్ చేయడం ఇండస్ట్రీ వర్గాలల్లో ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. టాక్కెట్ లని ఆన్ లైన్ లో తామే అమ్మేస్తామని.. ఆ మధ్య విడుదలైన స్టార్ హీరోల సినిమాలు కలెక్షన్ లని తప్పుగా చూపించి కోట్ల రూపాయలు ట్యాక్స్ ని ఎగవేశారని.. కొత్త సినిమాల టిక్కెట్ రేట్లు పెంచే విషయంలో ప్రభుత్వం ఇండస్ట్రీ వర్గాలకు సహకరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కల్యాణ్ సర్.. ఏపీ ప్రభుత్వం మధ్య రాజకీయ విభేధాలని పక్కన పెట్టండి. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం శ్రద్ధ తీసుకోండి. ప్రస్తుతం వున్న పరిస్‌థితుల్లో పరిశ్రను ఆదుకోవడం చాలా అవసరం. ఈ విషయంపై స్పందించిన కృషి చేయాలని పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు.
ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా నేను వినయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారితో పాటు సంబంధిత మంత్రులకి అభ్యర్థిస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైన సినిమా సమస్యలపై స్పందిస్తారని.. తద్వారా సినిమాని బ్రతికిస్తారని ఆశిస్తున్నాను` అని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. నాని చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి తరువాత ఒకే ఒక్క యంగ్ హీరో ఈ విధంగా స్పందించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది