Begin typing your search above and press return to search.
కారు యాక్సిడెంట్ పై నాని క్లారిటీ ఇచ్చాడు!
By: Tupaki Desk | 26 Jan 2018 5:34 PM GMTహీరో నాని ప్రయాణిస్తోన్న కారు ఈ రోజు ఉదయం ప్రమాదానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ప్రయాణిస్తున్న నాని కారు ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొనడంతో నానికి గాయాలయ్యాయని, నాని కారు డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే నాని ప్రథమ చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లిపోయారని - డ్రైవర్ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ ప్రమాద ఘటనను నాని ధృవీకరించారు. ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని - అయితే - తాను క్షేమంగా ఉన్నానని ట్వీట్ చేశారు.
ఆ ప్రమాద ఘటనపై అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని నాని ట్వీట్ చేశారు. ఆ ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని - కంగారు పడాల్సిన పనిలేదని ట్వీట్ చేశారు. యుద్ధానికి కొంతకాలం విరామం ప్రకటించానని...`కృష్ణార్జున యుద్ధం` షూటింగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. వారం రోజుల్లో తాను కోలుకుంటానని - మళ్లీ యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు. అయితే, నాని పెదవికి స్వల్ప గాయం అయిందని - అందుకే వారం రోజుల విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడం వల్లే నానికి - డ్రైవర్ కు ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే నాని....తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వేరే కారు తెప్పించుకుని దానిలో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో నాని కారు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించగా మద్యం సేవించలేదని తేలింది. నిద్రమత్తులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కారు డ్రైవర్ ....పోలీసులకు తెలిపారు.