Begin typing your search above and press return to search.
నాని.. బాగుంది నీ కహానీ
By: Tupaki Desk | 1 Sep 2015 6:09 AM GMTగజిని తర్వాత మతిమరుపు కాన్సెప్ట్ తో బోలెడన్ని చిత్రాలొచ్చాయి. ఒక దశలో ఆ తరహా సినిమాలు చూడలేక ప్రేక్షకులకు మొహం మొత్తినంత పనైంది. ఏదైనా సరే.. ఒకట్రెండు సినిమాలకే వర్కవుట్ అవుతుందేమో కానీ... పదే పదే అదే కాన్సెప్ట్ అంటే చిరాకు పుట్టేస్తుంది. అందుకే చాలా సినిమాల్ని తిరస్కరించారు. కొన్ని మాత్రం సక్సెస్ అయ్యాయి. అయితే `గజిని` వచ్చి ఏడెమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ మతిమరుపు కాన్సెప్టుపై మనోళ్లకు మక్కువ తగ్గలేదు. నానితో మారుతి తీసిన `భలే భలే మగాడివోయ్` సినిమా కూడా మతిమరుపు చుట్టూనే తిరుగుతుంది. అయితే దీనికి మాత్రం `గజిని`తో ఎలాంటి సంబంధం ఉండదంటున్నాడు మారుతి. గజిని సీరియస్ సబ్జెక్ట్ తో సాగుతుంది, మా సినిమా మాత్రం కామెడీ ప్రధానంగా నడుస్తుందని చెబుతున్నాడు. మరి ఈ కామెడీ గజని ఎలా నవ్విస్తాడో చూడాలి.
తెరపై నాని నటన ఎంతగా నవ్వులు పండిస్తుందో తెలియదు కానీ... సినిమాకి ముందు వినిపించిన ఆయన కహానీ మాత్రం కాస్త ఆసక్తినే క్రియేట్ చేస్తోంది. ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాని తన క్యారెక్టర్ సారం మొత్తం బయటపెట్టాడు. మతిమరుపుతో ఎలాంటి ఫన్ పుడుతుంటుందో సన్నివేశాలతో సహా బయట పెట్టేశాడు. సినిమాలో తన అసలు పేరు లక్కరాజు అనీ, కొసరు పేరు మాత్రం లక్కీ అని బుల్లి సైంటిస్ట్ గా కనిపిస్తానని చెప్పుకొచ్చాడు నాని. లక్కరాజు లక్కీ ఎలా అయ్యాడు? మతిమరుపు ఉన్న లక్కరాజు సైంటిస్ట్ గా ఎలా రాణించాడు? అందమైన అమ్మాయి ముందు తన వీక్ నెస్ ని ఎలా కవర్ చేసుకొంటూ వెళ్లాడు? ఆ క్రమంలో తన జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ఎలాంటిది? అనే విషయాలన్నీ ప్రేక్షకుడికి బాగా నచ్చుతాయని నాని చెబుతున్నాడు. ఈ సినిమాపై ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు. `ఎవడే సుబ్రమణ్యం` తర్వాత మరో హిట్టు చేతికందడం ఖాయం అన్న భరోసాతో ఉన్నాడు. మరి ఎలాంటి ఫలితం లభిస్తుందో చూడాలి. ఈ సినిమా సెప్టెంబరు 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది.