Begin typing your search above and press return to search.

నాని లోకల్ లెక్క కర్నూల్ లో తేలిందా

By:  Tupaki Desk   |   9 July 2016 5:13 AM GMT
నాని లోకల్ లెక్క కర్నూల్ లో తేలిందా
X
వరుసగా నాలుగు హిట్స్ కొట్టేసి మంచి ఊపు మీదున్నాడు నేచురల్ స్టార్ నాని. తన కెరీర్ లో బ్యాడ్ టైమ్ అంతా దాటేసి.. ఇప్పుడు బెస్ట్ ఫేజ్ లోకి అడుగు పెట్టడమే కాదు.. పరుగు పెట్టేస్తున్నాడు. జనరల్ గా నాని ప్రయోగాలు చేసేందుకు పెద్దగా వెనకాడడు కానీ.. ఇప్పుడు తేడా ఏంటంటే.. నాని చేసిన ప్రతీ ఎక్స్ పెరిమెంట్ సూపర్ గా క్లిక్ అవుతోంది.

నాని ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమాకి టైటిల్ గా.. 'నేను లోకల్' అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇలాంటి టైటిల్ క్లాస్ హీరోలకు ఏ మాత్రం సెట్ అవదు కానీ.. నాని ని సంథింగ్ డిఫరెంట్ అనాల్సిందే. అటు క్లాస్ సినిమాలు చేసినా.. ఇటు మాస్ గా కనిపించే థ్రిల్లర్ మూవీస్ చేసినా.. రెండు కేరక్టర్లనూ ఒకే సినిమాలో చూపించినా.. జనాలు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఇలా చెప్పేకంటే.. ఒకే గెటప్ తో రెండు రోల్స్ చేసినా ఒప్పించేయగల ట్యాలెంట్ నాని సొంతం. మరి అలాంటి ఇమేజ్ లో ఉన్న నాని... ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఉండేందుకు ఓ మాస్ రోల్ చేయడాన్ని ప్రత్యేకంగానే చెప్పకోవాలి.

నేను లోకల్ అంటూ.. కర్నూలు కుర్రాడిగా కొత్త సినిమాలో కనిపించనున్నాడు నాని. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ విచ్చలవిడిగా ఉంటాయని అంటున్నారు. 'వయొలెన్స్ లేని లవ్ స్టోరీలు ఎప్పుడొస్తాయో కదా' అంటూ రీసెంట్ గా జెంటిల్మన్ లో డైలాగ్ చెప్పిన నాని.. ఫుల్ లెంగ్త్ ఫ్యాక్షన్ రోల్ చేస్తుండడాన్ని ప్రత్యేకంగానే చెప్పుకోవాలి.