Begin typing your search above and press return to search.
అది నాని గొప్పదనం
By: Tupaki Desk | 8 July 2017 5:40 AM GMT‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు ముందు నానికి అంత గొప్ప ఫాలోయింగ్ ఏమీ లేదు. అప్పటికతను స్టార్ కూడా కాదు. లేక లేక ‘ఎవడే సుబ్రమణ్యం’తో ఓ మోస్తరు విజయాన్నందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కి హమ్మయ్య అనుకున్నాడు. అలాంటిది ‘భలే భలే మగాడివోయ్’ టైటిల్స్ లో నేచురల్ స్టార్ నాని అంటూ అతడికో బిరుదు కట్టబెట్టేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. దీని మీద కామెడీలు చేశారు. ఇదేదో సరదాకి చేసిందని అనుకున్నారు. కానీ రెండేళ్లు తిరిగేసరికి చూస్తే.. నాని నిజంగానే స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం తెలుగులో ఏ హీరోకూ సాధ్యం కాని విన్నింగ్ స్ట్రీక్ తో దూసుకెళ్లిపోతున్నాడు. వరుసగా ఒకటి రెండు కాదు.. ఏకంగా ఆరు హిట్లు కొట్టాడు. ఇప్పుడు ‘నిన్ను కోరి’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్లే కనిపిస్తున్నాడు.
సినిమా సినిమాకూ తన పెర్ఫామెన్స్ తో అతను ఎన్నో మెట్లు ఎక్కేస్తుండటం ఆశ్చర్యపరిచేదే. నాని కొత్త సినిమా వచ్చినపుడల్లా.. గత సినిమా కంటే బాగా చేశాడు.. మెచ్యూర్డ్ గా చేశాడన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇదే అతడి బెస్ట్ పెర్ఫామెన్స్ అనిపిస్తుంది. కానీ తర్వాత సినిమాతో ఇంకా బెటర్ అనిపిస్తాడు. ‘నిన్ను కోరి’ అందుకు తాజా రుజువు. ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఇది నాని బెస్ట్ పెర్ఫామెన్స్ అనిపిస్తుంది. నటన సంగతలా ఉంచితే తాను ప్రస్తుతం ఉన్న ఊపులో ఇలాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీకి నాని ఓకే చెప్పడమే ఆశ్చర్యం. ‘నేను లోకల్’లో హీరోయిజం ఎలివేట్ అయి.. మాస్ లోనూ ఫాలోయింగ్ పెంచుకున్న నాని.. ‘నిన్ను కోరి’లో మాత్రం హీరోయిజాన్ని పూర్తిగా వదిలేసి కథలో కలిసిపోయాడు. అక్కడ పాత్ర కనిపిస్తుంది తప్ప.. నాని కనిపించడు. సినిమా చివరికి వచ్చేసరికి నాని అనే వాడు సైడ్ అయిపోయి.. సినిమాలో ఆది-నివేదా లీడ్ క్యారెక్టర్లలా అనిపిస్తాడు. ఇది వాళ్ల సినిమాలా అనిపిస్తుంది తప్ప.. నాని ఇందులో హీరో అనిపించడు. ఇలాంటి ముగింపుకు నాని ఒప్పుకోవడమే అతడిలోని గొప్పదనం. కథకు అతనెలాంటి ప్రాధాన్యమిస్తాడనడానికి ఇది తాజా రుజువు. ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాని నటన చూస్తే అప్రయత్నంగా మన కళ్లు వర్షిస్తాయి. నాని మామూలోడు కాదని మరోసారి అనుకుంటాం.