Begin typing your search above and press return to search.
నాని బాగానే ఉన్నాడుగా
By: Tupaki Desk | 1 Feb 2018 11:28 AM GMTనేచురల్ స్టార్ నాని కారుకు వారం రోజుల క్రితం యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆ యాక్సిడెంట్‌లో నానీకి గాయాలయ్యాయని వార్తలు వచ్చాయి. అసలు నాని ఎలా ఉన్నాడో అని అభిమానులంతా కంగారు పడిపోయారు. ఆ ప్రమాదం తరువాత తాజాగా నాని అభిమానుల ముందుకు వచ్చి అనుమానాలన్నీ తీర్చాడు.
నానీ పూర్తిస్థాయి నిర్మాతగా మారి తెరకెక్కిన సినిమా అ. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఆ ఈవెంట్‌కు నానీతో పాటూ, అనుష్క, నిత్య మీనన్ వంటి తారలు వచ్చారు. ఆ ఈవెంట్‌లో నాని ఒంటిపై ఎక్కడా చిన్న కట్టు కూడా కనిపించలేదు. ఎక్కడా గాయాల తాలూకు మచ్చలు కూడా కనిపించలేదు. ఫుల్ జోష్ మీద మాట్లాడాడు నాని. కానీ... ఆ యాక్సిడెంట్ గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతడిని చూస్తే జరిగింది చిన్న ప్రమాదమేనని అర్థమైపోతుంది. కాకపోతే నానీ ఆ యాక్సిడెంట్ గురించి కూడా ఓ మాట అనేసి ఉంటే బాగుండేది అన్న వాదనలు వినిపిస్తాయి.
గత శుక్రవారం నాని కారు జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెం 45లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారు నానీతోపాటూ అతని తండ్రి రాంబాబు కూడా ఉన్నారని సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో కారు నడిపి యాక్సిడెంట్ కు గురైనట్టు పోలీసులకు చెప్పాడు. నానీ అక్కడే కారును వదిలి మరో కారులో ఇంటికి చేరుకున్నాడు. ఆ కారు నానీ తండ్రి గంటా రాంబాబు పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆ ప్రమాదంలో నానీ పెదవికి చిన్న గాయం అయ్యింది. మరుసటి రోజే నాని ట్విట్టర్‌లో ప్రమాదం పెద్దదేమీ కాదని - చిన్న గాయం మాత్రమే అయ్యిందని - అతి త్వరలో సినిమా షూటింగులో పాల్గొంటానని ట్వీటు చేశాడు. అయినా అభిమానుల్లో ఏదో ఆందోళన. తన అభిమాన హీరోకి ఏమైందోనని... ఇప్పుడు నానీని నేరుగా చూశారు కనుక ప్రశాంతంగా ఉండి ఉంటారు.
కాగా ప్రస్తుతం నాని ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తుండగా.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.