Begin typing your search above and press return to search.

నానీతో జున్ను.. జున్నుతో నాని.. అదీ సంగ‌తి

By:  Tupaki Desk   |   2 Nov 2020 7:20 PM IST
నానీతో జున్ను.. జున్నుతో నాని.. అదీ సంగ‌తి
X
నానీతో జున్ను అనుబంధం ఎలాంటిదో ప్ర‌త్యేకించి చెప్పాలా? కొడుకుతో వీలైనంత‌ ఎక్కువ స‌మ‌యం స్పెండ్ చేసేందుకే నాని ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంటాడు. క్ష‌ణం తీరిక లేని బిజీ షెడ్యూళ్ల‌ను మ్యానేజ్ చేస్తూ నాని కుటుంబంతో స్పెండ్ చేసేందుకు ప్ర‌త్యేక ప్లాన్స్ చేస్తుంటాడు.

ఈ లాక్ డౌన్ పీరియ‌డ్ లో అయితే తన కుమారుడు అర్జున్ తో నాని విలువైన సమయాన్ని గడిపాడు. అర్జున్ అల్ల‌రి వేషాల్ని స‌ర‌దా ప‌నుల్ని సోష‌ల్ మీడియాల్లో రివీల్ చేస్తూనే ఉన్నాడు నాని. తాజాగా అర్జున్ తో క‌లిసి తీసుకున్న ఫొటోలను నాని ఇన్ స్టాగ్రామ్ ‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయ్యాయి. నానీతో జున్ను.. జున్నుతో నాని! అంటూ ఫ్యాన్స్ ఒక‌టే ఫిదా అయిపోతున్నారు. ఈ ఫోటోల‌కు నాని స్నేహితులు మంచు ల‌క్ష్మి.. కీర్తి .. కామ్న కామెంట్లు చేసారు.

కెరీర్ సంగ‌తి చూస్తే... నాని న‌టించిన `వి` ఇటీవ‌లే రిలీజై ఆశించిన ఫ‌లితాన్ని అందివ్వ‌ని సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం శివ నిర్వాణ రూపొందిస్తున్న `టక్ జగదీష్`లో నటిస్తున్నాడు. దీని తర్వాత `శ్యామ్ సింగరాయ్`ను ప్రారంభించాల‌న్న‌ది ప్లాన్. ఈసారి వ‌రుస‌గా క‌మ‌ర్షియ‌ల్ హిట్లు కొట్టాల‌న్న పంతంతో ఉన్నాడ‌ట‌.