Begin typing your search above and press return to search.

ఫ్రంట్‌ లైన్ వర్కర్స్ కోసం నాని 'సంథింగ్ స్పెషల్'..!

By:  Tupaki Desk   |   8 Jun 2021 1:30 PM GMT
ఫ్రంట్‌ లైన్ వర్కర్స్ కోసం నాని సంథింగ్ స్పెషల్..!
X
కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్స్ - హెల్త్ వర్కర్స్ - ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. మహమ్మారి బారిన పడుతున్నా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు సేవ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇదే క్రమంలో కొన్ని హాస్పిటల్స్ - క్వారంటైన్ సెంటర్స్ లలో కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు హెల్త్ వర్కర్స్ డ్యాన్స్ కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి ఫ్రంట్‌ లైన్ వర్కర్స్ కోసం స్పెషల్ గా ఏదైనా చేయటం ఇప్పుడు తన వంతని అంటున్నారు నేచురల్ స్టార్ నాని.

నాని తాజాగా ట్వీట్ చేస్తూ ''మన ఫ్రంట్‌ లైన్ వర్కర్స్ కోసం మన హీరోల కోసం.. సంథింగ్ స్పెషల్ త్వరలో రాబోతోంది'' అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ లో స్టెతస్కోప్ ఎమోజి డాక్టర్ ని సూచిస్తుంది. ఈ సందర్భంగా నాని ఓ ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో చూస్తే నాని తన టీమ్ తో కలిసి వైద్యులపై ఏదో చిత్రీకరిస్తున్నట్లు అర్థం అవుతోంది. 'సంథింగ్ స్పెషల్' ఎంటనేది నాని చెప్పనప్పటికీ.. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా అవిరామంగా పనిచేస్తున్న ఫ్రంట్‌ లైన్ వర్కర్స్ కోసం ముందుకొస్తున్న నానిని ప్రశంసించాలి.