Begin typing your search above and press return to search.

నాని క్లాప్ కొట్టేశాడు..ఇక బ‌ద్ద‌ల్ బాసింగాలే.

By:  Tupaki Desk   |   16 Feb 2022 10:32 AM GMT
నాని క్లాప్ కొట్టేశాడు..ఇక బ‌ద్ద‌ల్ బాసింగాలే.
X
నేచుర‌ల్ స్టార్ నాని మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. గ‌త ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన నాని అదే జోరుని చూపిస్తూ మ‌రో రెండు చిత్రాల‌ని ఈ ఏడాది రెడీ చేస్తున్నాడు. గ‌త ఏడాది ఫ్యామిలీ ఎమోష‌న్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన `టక్ జ‌గ‌దీష్‌`తో ఆక‌ట్టుకున్న నాని ఆ వెంట‌రే `శ్యామ్ సింగ రాయ్‌` చిత్రంతో స‌రికొత్త సినిమాని అందించి సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.

ఈ మూవీలు అందించిన స‌క్సెస్ ఆనందంలో వున్న నాని `అంటే సుంద‌రానికి` చిత్రాన్ని పూర్తి చేసి మ‌రో చిత్రాన్ని తాజాగా ప‌ట్టాలెక్కించాడు.

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం `ద‌స‌రా`. యంగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని బుధ‌వారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న‌ శ్రీ‌కాంత్ ఓదెల‌కు ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌, నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి స్క్రిప్ట్ ని అందించారు.

హీరో నాని గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్న‌మైన మేకోవ‌ర్ తో లాంగ్ హెయిర్, బియ‌ర్డ్ తో ప‌క్కా మాసీవ్ పాత్ర‌లో న‌టిస్తున్న మాస్ ఎంటర్ టైన‌ర్ ఇది. ఇందులో నాని తెలంగాణ యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఓ టీచ‌ర్ శిక్ష‌ణ‌లో తెలంగాణ స్లాంగ్ పై ప‌ట్టు సాధించారు. ఇటీవ‌ల ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టైటిల్ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. టీజ‌ర్ లో నాని లుక్‌, తను ప‌లికిన తెలంగాణ డైలాగ్ లు చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే.

`ఈ ద‌స‌రా నిరుడు లెక్క వుండ‌ది బాంచ‌త్ .. జ‌మ్మి పెట్టి చెప్తుత‌న్నా బ‌ద్ద‌లు బాషింగాలైతై ఎట్లైతే గ‌ట్లాయె సూసుకుందాం` అంటూ టీజ‌ర్ లో నాని తెలంగాణ యువ‌కుడిగా చెప్పిన డైలాగ్ లు సినిమా ఏ రేంజ్ లో వుండ‌బోతోంద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి. నానికి స‌రికొత్త ఇమేజ్ ని అందించ‌నున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది.

మాసీవ్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయ‌ణ‌న్‌.. ఛాయాగ్ర‌హ‌ణం స‌త్య‌న్ సూర్య‌న్ - ఎడిటింగ్ న‌వీన్ నూలి.. ఆర్ట్ అవినాష్ కొల్ల‌.. తొలి సారి తెలంగాణ యువ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రం కోసం హీరో నాని ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌ని చూపిస్తున్నార‌ట‌. అంతే కాకుండా ఈ మూవీతో త‌న ఇమేజ్ మ‌రో స్థాయికి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని, మాస్ ప్రేక్ష‌కుల్లో త‌న‌కు మ‌రింత గుర్తింపుని తీసుకురావ‌డం ఖాయ‌మ‌ని నాని భారీ న‌మ్మ‌కంతో వున్నార‌ట‌.