Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూసివ్ : తుపాకీ డాట్ కామ్ తో నాని స్పెషల్ చిట్ చాట్
By: Tupaki Desk | 7 Sep 2019 11:36 AM GMT* హాయ్ నాని గారు జెర్సీ మేనియా నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లేనా?
అసలు నేను ఒక సినిమా పూర్తి ఐపోయాక దాని రిజల్ట్స్ వచ్చాక ఇక పట్టించుకోను. నా ఫోకస్ మొత్తం నెక్స్ట్ సినిమా పైనే ఉంటుంది. ఇప్పుడు నా మైండ్ మొత్తం గ్యాంగ్ లీడర్ పైనే ఉంది. కానీ జెర్సీ మాత్రం నా మనసుకి చాలా దగ్గరైన సినిమా. నాన్న అంటే ఎలా ఉండాలో నాకు నేర్పిన సినిమా.
* క్రౌడ్ పుల్లర్స్ తరువాత వచ్చే బ్యాచ్ హీరోల్లో మీరు మిగతా వారికంటే ఎక్కువ ఫాలోయింగ్ తో ఉన్నారు - మరి మాస్ హీరో ఇమేజ్ ఎప్పుడు తెచ్చుకొబోతున్నారు?
నాకు తెలిసినంత వరకు సినిమా హిట్ కొట్టి - నిర్మాత కి - కొనుకున్న వాళ్ళకి లాభాలు తెచ్చే ప్రతి హీరో క్రౌడ్ పుల్లర్ బ్యాచ్ లోకే వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ చాలా మారింది. కమర్షియల్ హంగులు కంటే కథ బావున్న సినిమాలనే జనాలు ఆదరిస్తున్నారు. మాస్ - క్లాస్ అనే తేడాలు ఇప్పుడు హీరోల కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపడం లేదు అని నా అభిప్రాయం.
* గ్యాంగ్ లీడర్ ఎలా మొదలయింది?
విక్రమ్ చాలా లైన్స్ చెప్పాడు - అందులో చాలా లైన్స్ నాకు నచినప్పటికీ నేను మాత్రం ఎందుకో వాయిదా వేస్తూ వచ్చాను - చివరికి ఈ గ్యాంగ్ లీడర్ స్టోరీ నచ్చింది. ఇందులో పెన్సిల్ పార్థసారధి గా కనిపించబోతున్నా. ఒక కామెడీ బ్యాక్ డ్రాప్ ఉన్న పాత్ర నాది.
* దాదాపు మీరు చేసిన చాలా పాత్రలకి కామెడీ టచ్ ఉంటూ ఉంటుంది - ఎందుకలా?
ఆ కామెడీ కావాలని పెట్టింది కాదు - ఏదో అలా కుదిరేస్తూ ఉంటుంది. అది ఆడియన్స్ కి కూడా బాగా నచ్చడం తో ఒక సినిమా తరువాత ఇంకో సినిమా అంటూ ఆ డైరెక్టర్స్ నా క్యారెక్టర్ కి కామెడీ టచ్ ఇస్తూ వచ్చారు. విక్రమ్ కూడా అదే ఫాలో అయ్యాడు. నా సినిమా కి వచ్చే ఆడియన్స్ హ్యాపీ ఐతే నాకు హ్యాపీ - అదే నా పాలసీ
* ఎక్కువ డబ్బులు పెట్టే నిర్మాతలు మీతో మాత్రం ఒక పెద్ద స్కేల్ లో సినిమాలు ఎందుకు చేయడం లేదు అని ఎప్పుడైనా అనుకున్నారా?
అసలు నేను బడ్జెట్ గురించి పట్టించుకోను - పెద్ద పెద్ద సినిమాలు తీసే మైత్రి మూవీస్ - దిల్ రాజు గారు నాతో కూడా సినిమాలు చేస్తున్నారు - కానీ నా మార్కెట్ ని బట్టి - కథ ని బట్టి నిర్మాత కి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కల ప్రకారమే బడ్జెట్ పెడుతుంటారు. కథ లేని సినిమా కోసం కోట్లు ఖర్చుపెట్టిన జనాలు ఆ సినిమా చూడరు. పెద్ద బ్యానర్ లో సినిమా చేస్తున్నాము అని ఎక్కువ బడ్జెట్ పెట్టాలి అంటే - నాతో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రారు.
* హీరో లని మీ సినిమాలతో విలన్స్ చేసున్నారు - ఎందుకలా?
(నవ్వులు) కార్తికేయ గురించే గా ఈ కామెంట్ - నిజానికి కార్తికేయ గ్యాంగ్ లీడర్ లో విలన్ కాదు - ఒక టిపికల్ క్యారెక్టర్ ఉన్న రేసర్ - చాలా కొత్తగా ఉంటుంది కార్తికేయ క్యారెక్టర్ - ఆడియన్స్ కూడా తన క్యారెక్టర్ చూసి థ్రిల్ అవుతారు. ఒక హీరో చేస్తే ఈ రోల్ చాలా బావుంటుంది అని అనుకున్నాం - కార్తికేయ సెట్ అవుతాడు అనిపించింది. అలా అలా కుదిరేసింది. హీరో లు విల్లన్స్ లేరు గ్యాంగ్ లీడర్ లో కాబ్బటి మీ కామెంట్ వెనక్కి తీసుకోండి(నవ్వులు)
* మీ గ్యాంగ్ కి మొత్తానికి కిక్ ఇచ్చే సక్సెస్ రావాలని మా తుపాకీ డాట్ కామ్ కోరుకుంటుంది అల్ ది బెస్ట్
మేము ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమాను దయచేసి థియేటర్ కి వెళ్లి చూడండి - పైరసీ ని ఎంకరేజ్ చేయకండి
థాంక్యూ