Begin typing your search above and press return to search.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో భారీ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేస్తున్నాడుగా..!
By: Tupaki Desk | 26 March 2021 2:30 AM GMTనేచురల్ స్టార్ నాని - రీతూ వర్మ - ఐశ్వర్యా రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''టక్ జగదీష్''. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 23న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించింది.
ఇప్పటి వరకు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్న నాని.. ఈ సినిమాతో కంప్లీట్ ఫ్యామిలీకి హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఫుల్ ఎమోషన్స్ తో నడిచే ఈ కథలో నాని క్యారెక్టరైజేషన్ తో పాటుగా ఇతర ప్రధాన ఆర్టిస్టుల నటన కూడా ఆకట్టుకుంటుందనేది ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతానికి 'టక్ జగదీష్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మంచి ఫిగర్స్ తో నడుస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 'నిన్ను కోరి' తర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇకపోతే 'టక్ జగదీష్' చిత్రంలో జగపతి బాబు - నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ వంటి భారీ తారాగణం కనిపించనున్నారు. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.