Begin typing your search above and press return to search.
నెక్స్ట్ నువ్వే నాని!
By: Tupaki Desk | 28 Aug 2018 6:26 AM GMTఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనేది వేదాంత ధోరణిలో సాగే ఒక పాత పాట. దాన్ని సినిమా భాషలో మార్చి రాసుకుంటే ఎవరో రికార్డులు సాధించారు వేరెవరో దానికి టార్గెట్ అయ్యారు అని వస్తుంది. ఈ ప్రస్తావన ఎందుకంటారా. గీత గోవిందంతో రైట్ రాయల్ గా ఓవర్ సీస్ లో 2 మిలియన్ మార్క్ సాధించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు మిగిలిన హీరోలకు పెద్ద సవాలే విసురుతున్నాడు. కేవలం 12 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం ఒక విశేషమైతే హీరోగా తన బ్రాండ్ తప్ప సినిమాలో ఇంకే చెప్పుకోదగ్గ గొప్ప అంశం లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఇప్పటిదాకా యూత్ ని బాలన్స్ చేస్తూ ఫామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయస్ గా న్యాచురల్ స్టార్ నాని ఉన్నాడు. యావరేజ్ కథలతో సైతం సూపర్ హిట్స్ కొట్టేసి నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు. కానీ కృష్ణార్జున యుద్ధం ఫలితం బోధి చెట్టు కింద జ్ఞానోదయం చేసినట్టు నానికి వార్నింగ్ బెల్ లా పని చేసింది. ఓవర్ సీస్ లో ఇప్పటి దాకా నానికి బలమైన మార్కెట్ ఉంది.
భలే భలే మగాడివోయ్ తో 1.4 మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టిన నాని ఆ తర్వాత వన్ మిలియన్ అయితే తేగలిగాడు కానీ 2 మిలియన్ మార్క్ మాత్రం కలలాగే మిగిలిపోయింది. ఏడు సినిమాలు వచ్చినా లాభం లేకపోయింది. కానీ విజయ్ దేవరకొండ అనూహ్యంగా గీత గోవిందంతో ఇది సాధించడంతో నానిపై సహజంగానే అభిమానుల నుంచి అంచనాలు మొదలవ్వడం ఖాయం. రేపు ఒకవేళ దేవదాస్ హిట్ అయినా అందులో నాగార్జున సమానంగా క్రెడిట్ తీసుకుంటాడు కాబట్టి ఇది నా సోలో సక్సెస్ అని నాని చెప్పుకోలేడు. సో తర్వాత వచ్చే జెర్సీ మీదే భారం మొత్తం ఉంటుంది. టైం అయితే పడుతుంది కానీ నాని భవిష్యత్తులో ఎంత త్వరగా 2 మిలియన్ మార్కు చేరుకుంటాడు అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ 2కు యాంకర్ గా ఒకవైపు టీవీ ప్రేక్షకులను మెప్పిస్తునే మరోవైపు సినిమాలు బాలన్స్ చేసుకుంటున్న నాని గతంలో తన ఎవడే సుబ్రహ్మణ్యంలో రిషిగా ఓ టిపికల్ పాత్ర చేసిన విజయ్ దేవరకొండ తనకే పోటీగా మారతాడని ఊహించాడో లేదో.