Begin typing your search above and press return to search.
నాని కొత్తగా.. 50 కోట్ల మార్క్
By: Tupaki Desk | 2 March 2018 11:30 PM GMTగత కొంత కాలంగా వరుస హిట్స్ తో దూసుకుపోతోన్న ఒకే ఒక్క హీరో న్యాచురల్ స్టార్ నాని. ఎక్కువగా ప్రయోగాలు చేయకుండా సింపుల్ గా హిట్స్ అందుకుంటూ వెళుతోన్న ఈ హీరో ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ అందుకోవడం లేదు. రెగ్యులర్ స్టోరిలే అయినా తనదైన శైలిలో కథను నడిపిస్తూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్నాడు. గడిచిన రెండేళ్లలో నాని మార్కెట్ కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో నాని సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.
స్టార్ హీరోల సినిమాలు ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటాయో చెప్పడం కష్టమే. కానీ నాని సినిమా మాత్రం మినిమామ్ అనేట్టుగా కలెక్షన్స్ అందుకుంటోంది. యూఎస్ లో నాని ప్రతి సినిమా లాభాలను అందించింది. అయితే నాని ప్రస్తుతం ఒకటే టార్గెట్ గా పెట్టుకున్నాడు. అదే 50 కోట్ల క్లబ్. ఈ రోజుల్లో మన స్టార్ హీరోలు ఆ మార్క్ ను ఈజీగా అందుకుంటున్నారు. ఇప్పుడు నానికి ఉన్న క్రేజ్ కు 50 కోట్ల మార్కెట్ ను సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు.
అలాంటి హిట్ కొట్టాలంటే కొంచెం డిఫెరెంట్ కథలను చేయాలి. నాని వినూత్నంగా చేయడం లేదు. లవ్ స్టోరీలనే ఎక్కువగా చేస్తున్నాడు అని ఈ మధ్య టాక్ ఎక్కువగా వినపడుతోంది. రాజమౌళి కూడా రీసెంట్ గా అ! ప్రీ రిలీజ్ లో కొత్తగా ట్రై చేయాలని సలహాలు ఇస్తుండడంతో నాని నుంచి ఆయన కూడా కొత్తదనం కోరుకుంటున్నట్లు చెప్పవచ్చు. అయితే నాని నెక్స్ట్ సినిమాలు అదే తరహాలో ఉంటాయట. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా సరికొత్తగా రాబోతున్నాడు. దీంతో ఆ సినిమాలు 50 కోట్ల క్లబ్ లో చేరిపోవడం పక్కా అనిపిస్తోంది.