Begin typing your search above and press return to search.

నేనైతే సినిమాను చూసేవాడ్ని కాదు -నాని

By:  Tupaki Desk   |   29 Sep 2016 8:56 AM GMT
నేనైతే సినిమాను చూసేవాడ్ని కాదు -నాని
X
''రిలీజ్ కు ముందు వర్షాల కారణంగా భయపడ్డాం. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులు వర్షాల్లో బయటకు వచ్చి సినిమాను చూస్తారా? అనే సందేహం వచ్చింది. నేనైతే ఖచ్చితంగా సినిమాను ఈ పరిస్థితుల్లో వెళ్ళి చూసేవాడిని కాదు. అలాంటి సమయంలో కూడా ఈ రేంజు కలక్షన్లు ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాల్సిందే'' అంటున్నాడు హీరో నాని. షాక్ చేయడమో థ్రిల్ చేయడమో అనే ఉద్దేశ్యం లేకుండా కేవలం ఎంటర్టయిన్ చేయాలనే ఉద్దేశ్యంతో ''మజ్నూ'' సినిమాను తీయగా.. అది బాగా రీచ్ అయ్యిందని అంటున్నాడు.

డబుల్ మీనింగులు.. అభ్యంతరక సిట్యుయేషన్లు.. వగైరా వగైరా లేకుండా సినిమాను తీశారంటూ అందరూ నానిని మెచ్చుకుంటున్నారట. అసలు ఇంత క్లీన్ సినిమాకు సెన్సార్ వారు యు/ఎ ఎందుకిచ్చారు అంటూ కూడా మన హీరోకు లేఖలు రాస్తున్నారట. ''యంగ్ స్టర్స్ కు బాగా కనక్ట్ అవుతారు కాని.. ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమాలో లవ్ స్టోరీ నచ్చదేమో అనుకున్నాం. కాని నాలుగు లైన్లలో ఈ సినిమా ఎంత నచ్చిందో యూత్ చెబుతుంటే.. ప్రేమకథ నచ్చిందంటూ పెద్దాళ్లందరూ పేరాలు పేరాలు చెప్పేస్తున్నారు. బహుశా దర్శకుడు విరించి వర్మ చేసిన రచన మ్యాజిక్ అదేమో'' అని చెప్పాడు నాని.

వైజాగ్ - రాజమండ్రి - విజయవాడలో ఈ వీకెండ్ అంతా సక్సెస్ సెలబ్రేషన్ టూర్ ప్లాన్ చేశారట. ఈ రేంజు రిసీవింగ్ తో పాటు కలక్షన్లు కూడా ఇస్తున్న ప్రేక్షకులకు నాని స్వయంగా థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నాడట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/