Begin typing your search above and press return to search.

అ!! తర్వాత నాని మెచ్చిన కథ!!

By:  Tupaki Desk   |   30 Sep 2018 6:07 AM GMT
అ!! తర్వాత నాని మెచ్చిన కథ!!
X
న్యాచురల్ స్టార్ నాని హీరోగానే తనకు తాను పరిమితులు విధించదలుచుకోలేదు. యాంకర్ గా బిగ్ బాస్ 2 షోని విజయవంతంగా నడిపించి ఈ రోజుతో దానికి గుడ్ బై చెప్పేసాడు. మరోవైపు నిర్మాతగా ఎప్పటికప్పుడు నచ్చిన కథలతో ప్రయోగాలు చేయడానికి కూడా సిద్ధ పడుతున్న నాని అ! తో టైటిల్ కార్డు లో నిర్మాతగా తన పేరు వేసుకుని అందులో కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు నాని మరోసారి నిర్మాణ భాగస్వామిగా మారేందుకు ఆసక్తి చూపుతున్నాడట.

ఇటీవలే దిల్ రాజు ఆహ్వానం మేరకు తమిళ సినిమా 96ని ప్రత్యేకంగా వీక్షించిన నాని అది విపరీతంగా నచ్చడంతో ప్రొడక్షన్ లో పార్టనర్ గా ఉండేలా దిల్ రాజును అడిగాడట. కానీ ఇరు వైపులా ఏ నిర్ణయం ఇంకా జరగలేదని తెలిసింది. నిన్న నాని సమంతాలు 96 రీమేక్ లో నటించబోతున్నారు అనే వార్త బాగానే హల్చల్ చేసింది. దిల్ రాజు కేవలం హక్కులు కొనడం మాత్రమే జరిగిందని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని తర్వాత ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. మరి నానికి అంత బాగా నచ్చినప్పుడు చేయొచ్చుగా అనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం.

నిజానికి 96 ప్యూర్ యూత్ లవ్ స్టోరీ కాదు. 35 ఏళ్ళు దాటిన ఇద్దరు చిన్ననాటి స్కూల్ లో కలిసి చదువుకున్న అమ్మాయి అబ్బాయి ఇప్పుడు కలుసుకుంటే వాళ్ళ మధ్య కలిగే ఫీలింగ్స్ ఏర్పడే అనుబంధం వ్యక్తమయ్యే ప్రేమ వీటిని ఆధారంగా దర్శకుడు ప్రేమ్ సెన్సిబుల్ గా తీసాడు. అందుకే విజయ్ సేతుపతి త్రిషలను తీసుకున్నారు. మరి ఆ ఏజ్ లో జంటగా నాని సమంతాలు చూపడం అంటే చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. అసలు ఎవరిని అనుకోలేదని దిల్ రాజు చెప్పేసారు కాబట్టి ఫైనల్ అయ్యే దాకా చెప్పలేం కానీ నాని నిర్మాతగా మారేందుకు ప్రేరణ ఇచ్చింది అంటే 96లో మంచి కంటెంట్ ఉన్నట్టే అనిపిస్తోంది.

అక్టోబర్ 4న విడుదల కానున్న 96 ఫలితం మీద తెలుగు కాకుండా ఇతర బాషా దర్శక నిర్మాతలు కూడా కన్నేశారు. రిజల్ట్ ని బట్టి హక్కుల కోసం వెంటనే కర్చీఫ్ వేసేందుకు రెడీగా ఉన్నారు. మరి నాని సహ నిర్మాతగా నిజంగా ఉండబోతున్నాడా లేక ఇది కూడా ప్రచారంలోకి వచ్చినా గాసిప్పా అనేది తేలడానికి ఎక్కువ టైం పట్టదు లెండి.