Begin typing your search above and press return to search.
బాలయ్యని నాని బాగా వాడాడుగా
By: Tupaki Desk | 12 Feb 2016 4:18 PM GMTచిన్న హీరోలు స్టార్ హీరోలను వారి పేర్లను - డైలాగ్ లను - హిట్ సినిమా సీన్లను వాడేస్తుంటారు. బడా హీరోల అభిమానుల దృష్టిలో పడ్డం కోసం ఈ పాట్లు పడతారు. ఇలా ఇప్పటివరకూ చాలానే సినిమాలు వచ్చాయి కానీ.. మొదటిసారిగా కృష్ణగాడి వీర ప్రేమగాధలో హీరో కేరక్టర్ ని బాలయ్యకి అభిమానిగా చేశారు.
అసలు సినిమానే రాయలసీమ బ్యాక్ డ్రాప్ కావడం ప్లస్ పాయింట్. ఎందుకంటే అక్కడ బాలయ్యబాబుకి ఉండే క్రేజ్ అపారం. అందుకే బాలయ్యకి సంబంధించిన డైలాగ్స్ - జై లాబయ్య అంటూ అరుపులు, చేతిపై బాలయ్య టాటూతో.. సినిమా అంతా నాని ఓ రేంజ్ లో రచ్చ చేశాడు. ఏదో ఒకటీ అరా సీన్లలో కాదు.. ఈ వాడకం సినిమా అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నందమూరి అభిమానులు సంబరంల చేసుకునే రేంజ్ లో బాలయ్యని వాడుసేకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. అయితే.. మధ్యలో మెగా ఫ్యాన్స్ ఏమన్నా హర్ట్ అవుతారని అనుకున్నాడేమో.. అందుకే అత్తారింటికి దారేది సీన్ ని ఉపయోగించుకున్నారు.
ఇక్కడితో ఏమీ కథ అయిపోలేదు.. అసలు బాలయ్య స్టైల్ లో నాని యాక్ట్ చేస్తూ చేసిన తొడకొట్టే సీన్ అయితే అదుర్స్ అనాల్సిందే. అంతే కాదు.. అసలు సెకండాఫ్ లో అయితే అనుక్షణం బాలకృష్ణ గుర్తొస్తూనే ఉంటాడు. ఎందుకంటారా... మరి సెకండాఫ్ అంతా హీరో పేరు.. లెజెండ్ కదా. ఇప్పుడర్ధమైందా.. బాలయ్యని ఏ రేంజ్ లో వాడేసుకున్నారో!