Begin typing your search above and press return to search.
నాని మళ్లీ గొంతు విప్పాడు
By: Tupaki Desk | 2 July 2018 4:11 AM GMTనాచురల్ స్టార్ ఓ సినిమాలో వినిపించేందుకు రెడీ అయిపోయాడు. తెరపై చలాకీ నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే నాని తాజాగా ఓ సినిమాలో తన మాటలతో ఎంటర్ టెయిన్ చేయబోతున్నాడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈమాయ పేరేమిటో సినిమా కోసం ఈ యంగ్ హీరో వాయిస్ ఓవర్ ఇప్వనున్నాడు. ఇంతకుముందు తన సొంత ప్రొడక్షన్ లో వచ్చిన ‘అ!’ సినిమాలో ఓ చేపకు వాయిస్ ఇచ్చాడు.
టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం ఫైట్ మాస్టర్ గా పనిచేసిన విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా ఈమాయ పేరేమిటో సినిమా వస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో బజ్ తెచ్చేందుకు ఫైట్ మాస్టర్ ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలను ఉపయోగిస్తున్నాడు. టీజర్ లాంచ్ నాగచైతన్య చేతులమీదుగా చేయించాడు. తాజాగా ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటూ ఫైట్ మాస్టర్ విజయ్ స్వయంగా కోరడంతో నాని ఓకే అన్నాడని తెలిసింది. కొత్త డైరెక్టర్ రాము కొప్పాల డైరెక్ట్ చేస్తున్నఈ మాయ పేరేమిటో మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టాలని చూసేవాళ్లకు స్టార్ హీరోల సపోర్ట్ ఎంతో ప్లస్సవుతుంది. అందుకే తమ సినిమా గురించి పేరున్న హీరోలు రెండు మంచి మాటలు చెప్పినా చాలని కొత్త హీరోలు ఆశపడతారు. అదే వారసత్వంగా సినిమాల్లోకి అడుగుపెడుతుంటే స్టార్ హీరోల నుంచి హెల్ప్ ఈజీగానే దొరుకుతుంది. ఇప్పుడు నాని హెల్ప్ రాహుల్ విజయ్ కు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.