Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: నాని Vs సుధీర్ బాబు

By:  Tupaki Desk   |   28 Jan 2020 11:07 AM IST
ఫస్ట్ లుక్: నాని Vs సుధీర్ బాబు
X
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని.. నుధీర్ బాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా 'V'. న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో ఇది మైల్ స్టోన్ 25 వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా తన కెరీర్ లో తొలిసారిగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తున్నారు. సుధీర్ బాబు మాత్రం నానిని ఎదుర్కొనే పాత్రలో నటిస్తున్నారు. సుధీర్.. నాని పాత్రల గురించి హింట్ ఇస్తూ 'సేవియర్ Vs డెవిల్' అంటూ సుధీర్ ను రక్షకుడు.. నానిని రాక్షసుడు అని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. నిన్న సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ఈరోజు ఉదయం నాని పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ వారు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ "ఇలాంటి డెవిల్ మరొకరు ఉండరు. 'V' సినిమాలో రాక్షసుడు గా నాని ఫస్ట్ లుక్" అంటూ ట్వీట్ చేశారు. ఎప్పుడూ స్మార్ట్ గా పక్కింటబ్బాయి లాగా ఉండే నాని ఈ పోస్టర్ లో యమా రఫ్ గా ఊర మాస్ గా కనిపిస్తున్నాడు. రాక్షసుడు టాగ్ కు తగ్గట్టే గడ్డం పెంచి మీసాలు మెలిదిప్పి మరీ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక చేతిలో రక్తం కారుతున్న ఒక కత్తెర కూడా ఉంది. ఎవరినో ఆ కత్తెరతో ఫసాక్ చేశాడేమో మరి. అసలేమీ మేకప్ లేనట్టుగా మోటుగా ఉన్నాడు. నాని రాక్షసుడు గెటప్ అదిరిపోయింది.

ఇక నిన్న రిలీజ్ అయిన సుధీర్ బాబు పాత్ర ఫస్ట్ లుక్ దీనికి వ్యతిరేకంగా ఉంది. "తప్పు జరిగితే యముడు వస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం" అంటూ సుధీర్ ను పవర్ ఫుల్ గా పరిచయం చేశారు. పోలీస్ ఆఫీసర్ తరహాలో పిస్తోలు ఎక్కుపెట్టి కనిపించాడు. నాని.. సుధీర్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ 'V' సినిమా పై అంచనాలు పెంచేలా ఉన్నాయి.

ఈ సినిమాలో అదితి రావ్ హైదరీ.. నివేద థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు.. వెన్నెల కిషోర్.. శ్రీనివాస్ అవసరాల.. నాజర్.. ప్రియదర్శి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాను మార్చ్ 25 న విడుదల చేస్తున్నారు.