Begin typing your search above and press return to search.
నానీని మార్చే కథ లేదా?
By: Tupaki Desk | 2 Jan 2018 12:22 PM GMTఈ రోజుల్లో వరుసగా హిట్స్ అందుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. సినిమా సినిమాకు కొత్తగా కనిపిస్తేనే ఏదైనా లాభం ఉంటుంది. అంతే కాకుండా హెయిర్ స్టైల్ దగ్గరి నుంచి ఫిట్ నెస్ వరకు కొత్తగా కనిపిస్తేనే స్టార్ హీరోగా వారికంటూ ఒక గుర్తింపును దక్కించుకుంటారు. కానీ నాని మాత్రం ఆ విధంగా కనిపించకుండా సింపుల్ లుక్ తో హిట్స్ అందుకుంటున్నాడు. దాదాపు నాని మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు హెయిర్ స్టైల్ లో గాని ఫిట్నెస్ లో గాని పెద్దగా మార్పులు చేయలేదు.
ఆ మధ్యలో జెండాపై కపిరాజు అనే సినిమాలో కాస్త వెరైటీ లుక్ తో కనిపించాడు గాని సక్సెస్ ను మాత్రం అందుకోలేదు. ప్రస్తుతం నార్మల్ రెగ్యులర్ లుక్ తో హిట్టు అందుకుంటున్నా కూడా ఓ వర్గం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఆ మచ్చ తొలగించుకోవాలంటే నాని ప్రయోగం చేయాల్సిందే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నానికి కుడా కొత్తగా ట్రై చేద్దామనుకుంటే అలాంటి పాత్రలు దక్కడం లేదు. ఒకవేళ వస్తే ఫిట్నెస్ లో ఎలాంటి మార్పులకైనా సిద్ధమని అంటున్నాడు. అయితే ఎదో కొత్తగా కనిపించాలని మాత్రం కాదట. కేవలం కథ డిమాండ్ చేస్తేనే నాని బాడీ పెంచుతానని అంటున్నాడు.
ఈ రోజుల్లో నాని వయసులో ఉన్న హీరోలు ప్రతి సినిమాలో డిఫెరెంట్ గా ఉండాలని వారిని వారు కొత్తగా మార్చుకుంటున్నారు. మరి నెక్స్ట్ నానిని మార్చే కథలు వస్తాయో లేదో చూడాలి. ఒకవేళ వస్తే నాని ఎలా కనిపిస్తాడో. అయితే నాని ఫిట్ లుక్ లో కనిపించాలంటే.. దానికి తను జిమ్ చేస్తే చాలు కాని.. కథ అవసరం ఏమీ లేదని అనేవారు కూడా ఉన్నారండోయ్.