Begin typing your search above and press return to search.
'దేవదాస్' వద్దనుకున్నాను, కాని..!
By: Tupaki Desk | 27 Sep 2018 1:05 PM GMTనాగార్జున - నాని హీరోలుగా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు - సినీ జనాల్లో కూడా మంచి అంచనాలున్నాయి. అందుకే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాను తాను చేయవద్దని భావించాను, కాని అనుకోకుండా మళ్లీ కమిట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు.
నాని మాట్లాడుతూ.. వైజయంతి మూవీ వారి వద్ద ఈ కథ చాలా కాలంగా ఉంటూ వచ్చింది. ఈ కథను మంచి దర్శకుడి చేతిలో పెడితే తాను తప్పకుండా చేస్తాను అంటూ నాగార్జున గారు అన్నారు. అందుకే పలువురు దర్శకులను పరిశీలించిన తర్వాత శ్రీరామ్ ఆధిత్య అయితే ఈ చిత్రంను బాగా చేస్తాడనిపించింది. అందుకే కథను ఇచ్చి 40 రోజుల్లో స్క్రిప్ట్‌ను సిద్దం చేయాల్సిందిగా చెప్పాను. సినిమా పూర్తి కమర్షియల్ గా కాకుండా - రియలిస్టిక్ గా కాకుండా మీడియంగా ఈ చిత్రం ఉండాలి. అలాంటి సినిమా ‘శమంతకమణి’. ఆ సినిమా చూసిన తర్వాత ఈ చిత్రానికి శ్రీరామ్ దర్శకత్వం చేస్తే భాగుంటుందని అంతా అనుకున్నాం. ఆ సమయంలోనే నాకు డేట్లు ఇబ్బంది అయ్యింది. డేట్ల కారణంగా సినిమాను వదిలేద్దామని భావించాను. కాని మంచి స్క్రిప్ట్ ను వదిలేసినట్లు అవుతుందని - తప్పకుండా చేయాలనే పట్టుదలతో డేట్లు సర్దుబాటు చేసుకుని మరీ ఈచిత్రంలో నటించినట్లుగా నాని చెప్పుకొచ్చాడు.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా ఆకాంక్ష సింగ్ - నానికి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ చిత్రం తర్వాత మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు వస్తాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.