Begin typing your search above and press return to search.

చంటబ్బాయిగా నాని?

By:  Tupaki Desk   |   15 Feb 2018 2:21 PM GMT
చంటబ్బాయిగా నాని?
X
హీరో గా ఒక స్థాయి కి చేరుకున్న నాని ఇపుడు 'అ!' అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ప్రోమోషన్ల లో బీభత్సంగా తిరిగేస్తూ బోలెడన్ని విషయాలు మీడియాతో షేర్ చేసుకుంటున్నాడు. మెగాస్టార్ లాగా బ్యాగ్రౌండ్ ఏమి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్న నాని.. చిరంజీవి సినిమాలలో ఏ సినిమా రీమేక్ చేయాలి అని అనుకుంటున్నాడో తెలుసా?

చంటబ్బాయి!! హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి, సుహాసిని ముఖ్య తారాగణం గా నటించిన కామెడీ సినిమా చంటబ్బాయి అప్పట్లోనే రికార్డులను సృష్టించింది. అందులో డిటెక్టివ్ లా చిరంజీవి నటన అమోఘం. స్టార్ హీరో తో సైతం కామెడీ ని అద్భుతంగా పండించిన చిత్రం అది. ఎంటర్టైన్ చేయడంలో నాని కి ఒక ప్రత్యేక శైలి ఉంది. చాలా వరకు నాని కి చిరంజీవి కి పోలికలు ఉంటాయి. అందుకే సినిమా జనాలు కూడా మెగాస్టార్ పాత్రకు నాని బాగా సూటు అవుతాడు అంటున్నారూ.

ఇప్పటిదాకా నాని ఒక హిందీ సినిమా బ్యాండ్ బాజా బారాత్ ను రీమేక్ చేసాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. మరి నిజంగానే నాని చిరంజీవి చంటబ్బాయి రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది? హిట్ అవుతుంది అంటారా? ఒకవేళ నాని ఆ సినిమాను తీసేస్తా మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా? అది కూడా చూడాల్సిన విషయమే.