Begin typing your search above and press return to search.

లైగ‌ర్ కి నాని విషెస్.. ఎమోష‌న్ లో VD

By:  Tupaki Desk   |   25 Aug 2022 3:47 AM GMT
లైగ‌ర్ కి నాని విషెస్.. ఎమోష‌న్ లో VD
X
నేచుర‌ల్ స్టార్ నాని ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వ‌యంకృషితో స్టార్ అయ్యాడు. టాలీవుడ్ లో ఉన్న ప్ర‌తిభావంతుల్లో ఒక‌డిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. నేటిత‌రంలో ఇంతింతై అన్న చందంగా ఎదిగి భారీ పారితోషికం అందుకుంటున్న స్టార్ నాని.

నాని త‌ర్వాత మ‌ళ్లీ అంతే పెద్ద రేంజులో ఓ వెలుగు వెలుగుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నాని త‌ర‌హాలోనే ఆరంభం దేవ‌ర‌కొండ చాలా ఇబ్బందులతో పాటు ఛాలెంజులు ఎదుర్కొన్నాడు. సినీనేప‌థ్యం లేక‌పోయినా స్వ‌యంకృషితో ఎదిగాడు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. త‌న‌కంటే సీనియ‌ర్లు ఎంద‌రు ఉన్నా రేసులో స్పీడ్ గా దూసుకెళుతున్నాడు దేవ‌ర‌కొండ‌.

కానీ ఎంత ఎదిగినా అత‌డు త‌న కెరీర్ ఆరంగేట్ర రోజులను అస్స‌లు మ‌ర్చిపోలేదు. మూలాల్ని విడిచిపెట్ట‌లేదు. లైగ‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా నాని త‌న‌కు విషెస్ తెల‌ప‌గానే .. విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యాడు.

తెలుగు సినిమాకు .. మన ప్రేక్షకులకు ఆగస్టు అద్భుతమైన నెల. #బింబిసార #సీతారామం #కార్తికేయ2 టీమ్ లకు అభినందనలు. ప్రియమైన దేవ‌ర‌కొండ‌-పూరి జ‌గ‌న్ సార్ ఈ నెలను సందడిగా ముగించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.. అని నాని ట్వీట్ చేశారు.

దానికి ప్ర‌తిస్పందిస్తూ వీడీ ఇలా రిప్ల‌య్ ఇచ్చారు. "ఈ రోజు మీ గురించి ఆలోచిస్తున్నాను. నేను మీతో ఎలా ప్రారంభించానో.... ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను!" అంటూ దేవ‌ర‌కొండ ఎమోష‌న‌ల్ గా ట్వీట్ చేశాడు. నాని - దేవ‌ర‌కొండ ఇద్ద‌రూ స్వ‌యంకృషితో ఎదిగిన హీరోలు. ఆ ఇద్ద‌రూ క‌లిసి 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం' చిత్రంలో న‌టించారు.

నాని అప్పటికే సీనియ‌ర్ అయినా స‌రైన విజ‌యాల్లేవ్. దేవ‌ర‌కొండ‌కు సోలో హీర‌గా ఎద‌గ‌క ముందు చేసిన చిత్ర‌మిది. నాటి రోజుల‌ను ఆ ఇద్ద‌రూ ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేదు. అందుకే దేవ‌ర‌కొండ అంత‌గా ఎమోష‌న‌ల్ అయ్యాడు. అప్ప‌టి రోజుల‌ను గుర్తు చేసుకున్నాడు. ఇక‌పోతే నాని-దేవ‌ర‌కొండ క‌లిసి మునుముందు మరో సినిమాలో న‌టిస్తారేమో చూడాలి.