Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: #Nani2point0

By:  Tupaki Desk   |   30 May 2017 1:20 PM GMT
ఫోటో స్టోరి: #Nani2point0
X
ఇప్పుడు దాదాపు తండ్రులైన తెలుగు స్టార్లందరూ దాదాపు తమ కొడుకుల ఫోటోలతో సోషల్ మీడియాను మాట్లాడితే ఇంట్రెస్టింగ్ గా మార్చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన కొడుకుతో అల్లు అర్జున్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటాడు. అదే విధంగా ఎన్టీఆర్ కూడా ఈ మధ్యన తన కొడుకుతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పుడు ఈ లిస్టులో నాని కూడా చేరాడు.

ఈ మధ్యనే హీరో నానికి కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ బుడతడి పేరు అర్జున్ అని నామకరణం చేశారు. అయితే ఇప్పుడు నాని తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ.. ''Say Hi to everyone Arjun :) #Nani2point0'' అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన కొడుకుతో ప్రపంచానికి హాయ్ చెప్పించాడులే. బాగానే ఉంది. అయితే అక్కడ ఆ ఫోటో రావడం ఆలస్యం.. ఇక్కడ అభిమానులందరూ.. వావ్ 'లిటిల్ నేచురల్ స్టార్' అంటూ సందడి చేయడం స్టార్ట్ చేశారు. నాని కష్టపడి సినిమా హీరో అయినా కూడా.. అతని కొడుకు అప్పుడే సెలబ్రిటీ అయిపోయాడు. అదే పవర్ ఆఫ్‌ స్టార్ కిడ్స్ అంటే.

సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాని ''నిన్ను కోరి'' సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/