Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ కోసం తాళం కొన్న నటుడు

By:  Tupaki Desk   |   5 Aug 2020 12:30 PM GMT
హీరోయిన్‌ కోసం తాళం కొన్న నటుడు
X
ఈమద్య కాలంలో తమిళ మీడియాతో పాటు తెలుగు మీడియాలో కూడా ప్రముఖంగా కనిపిస్తున్న సినీ సెలబ్రెటీ వనిత విజయ్‌ కుమార్‌. తమిళ బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అయిన ఈమె అప్పటి నుండి రెబల్‌ గానే వ్యవహరిస్తూ వస్తుంది. ఈ లాక్‌ డౌన్‌ లో మూడవ పెళ్లి చేసుకున్న వనిత విజయ్‌ కుమార్‌ మళ్లీ వివాదాస్పదం అయ్యింది. తన మొదటి భార్యకు విడాకులు తీసుకోని పీటర్‌ పాల్‌ ను వివాహం చేసుకోవడంతో వనిత పై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.

సినీ ప్రముఖులు పలువురు ఈమెను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు. తనపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే ఈమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈమె ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఒక టీవీ ఛానెల్‌ కార్యక్రమంలో ఈమె చేసిన రచ్చపై పలువురు పలు రకాలుగా విమర్శలు చేశారు. అందులో నటుడు నంజిల్‌ కూడా ఉన్నాడు. వనితపై నటుడు నంజిల్‌ విమర్శలు చేశాడు. ఆమె మాట తీరు ఏమాత్రం బాగాలేదంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

నంజిల్‌ వ్యాఖ్యలపై ఇటీవల స్పందించిన వనిత విజయ్‌ కుమార్‌.. నాకు నంజిల్‌ ఫోన్‌ చేసి క్షమాపణలు అడిగాడు. మా ఇద్దరి మద్య ఉన్న వివాదం గురించి పూర్తిగా మాట్లాడుకుని తప్పేం లేదని నిర్ణయానికి వచ్చాను. అతడు నన్ను విమర్శించిన వీడియోలను తొలగిస్తానంటూ చెప్పాడు. అతడి క్షమాపణలతో మా ఇద్దరి మద్య ఉన్న గొడవ సర్దుమనిగిందంటూ వ్యాఖ్యలు చేసింది.

వనిత వ్యాఖ్యలను నంజిల్‌ కొట్టి పారేశాడు. అసలు ఇప్పటి వరకు తాను ఎప్పుడు కూడా వనితకు ఫోన్‌ చేయలేదు. ఇక క్షమాపణలు చెప్పేందుకు నేనేమి తప్పు చేయలేదు అంటూ ట్వీట్‌ చేశాడు. మరో ట్వీట్‌ లో ఒక పెద్ద తాళంను నేను కొనుగోలు చేశాను. ఈ తాళంను ఒక సెలబ్రెటీ కోసం కొనుగోలు చేశాను. ఆ సెలబ్రెటీ ఎవరో మీరు ఏమైనా ఊహించగలరా అంటూ ప్రశ్నించాడు. ఎక్కువ శాతం మంది ప్రస్తుత సమయంలో ఈ తాళం వనిత విజయ్‌ కుమార్‌ కు అయితే బాగుంటుందన్నారు. మరికొందరు నీకు ఈ తాళం పడాల్సిందే అంటూ ఆయన్నే కామెంట్‌ చేశారు.