Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మురిపించిన మెగా తండ్రీ కూతుళ్లు

By:  Tupaki Desk   |   30 Oct 2017 4:14 AM GMT
ట్రైలర్ టాక్: మురిపించిన మెగా తండ్రీ కూతుళ్లు
X
నిజజీవితంలోని అనుబంధాలతోనే తెరపైనే కనిపించే అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది. అది అభిమానులకు బాగా నచ్చడంతో పాటు ఆ పాత్రలతో చాలా ఈజీగా కనెక్టవడానికి వీలవుతుంది. మెగా ఫ్యామిలీలోని నాగేంద్రబాబు - ఆయన కుమార్తె నీహారిక మొదటిసారి తండ్రీకూతుళ్ల కథలో నటిస్తున్నారు. అయితే ఇది సినిమా కాదు.. వెబ్ సిరీస్.

నాన్న కూచి పేరిట రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రయిలర్ ను నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. సినిమాకు ఏ మాత్రం తీసిపోని క్వాలిటీతో ఈ వెబ్ సిరీస్ తీస్తున్నారని ట్రయిలర్ చూస్తే తెలిసిపోతోంది. అచ్చం ఫ్రెండ్స్ లా ఉండే ఆనందరాజ్ - తార అనే తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఈ వెబ్ సిరీస్ తీశారు. ఇందులో నిహారికకు ఓ లవ్ స్టోరీ ఉంటే.. నాగబాబుకూ ఇంకో లవ్ స్టోరీ ఉండటం విశేషం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు నిర్మాత కూడా నీహారికనే. బి.ప్రణీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

మంచి మ్యూజిక్.. చక్కటి పిక్చరైజేషన్ తోపాటు డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్న నాన్నకూచి వెబ్ సిరీస్ అభిమానులను ఇట్టే ఆకట్టుకునేలానే ఉంది. నీహారిక సినిమాల్లోకి రాకముందు ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. నాగశౌర్య పక్కన హీరోయిన్ ఒక మనసు మూవీతో వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ పక్కన హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో నటిస్తోంది.