Begin typing your search above and press return to search.
బాయ్ ఫ్రెండ్స్ తో హీరోయిన్స్ రచ్చ
By: Tupaki Desk | 7 Dec 2016 4:41 AM GMTవరస హిట్స్ తో ఊపు మీదున్న కుమారి హెబ్బా పటేల్.. నెల రోజుల గ్యాప్ లోనే మరో మూవీతో హీట్ పెంచడానికి వచ్చేస్తోంది. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అంటూ హంగామా చేయడానికి రెడీ అయిపోయింది. వచ్చే వారం రిలీజ్ కానున్న ఈ మూవీ ఎలా ఉంటుందో కానీ పోస్టర్స్ మాత్రం హీటెక్కిస్తున్నాయ్. హెబ్బా పటేల్ అండ్ తేజస్వి గ్లామర్ విషయంలో పోటీ పడ్డారనే విషయం క్లియర్ గా అర్థమైపోతుంది.
ముందైతే సినిమా పేరు నేను నా బాయ్ ఫ్రెండ్స్. కానీ సినిమా దిల్ రాజు చేతిలో పడే సరికి టైటిల్లో నాన్న యాడ్ అయాడు. సినిమాలో మంచి కంటెంట్ ఉందని.. అయితే టైటిల్ తేడాగా ఉందని దిల్ రాజు దగ్గరుండి మరీ ఈ ఛేంజ్ చేయించాడు. ఇక గ్లామర్ ఆరబోసే విషయంలో హెబ్బా పటేల్ ఎలాంటి రూల్స్ పెట్టుకోదు. కుమారి దగ్గర్నుంచి నిన్న వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా వరకు ఎంత గ్లామర్ చూపించాలో అంత చూపించింది. బాయ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ చుట్టూ తిరిగే సినిమాలో ఆగుతుందా? సీన్స్ సంగతెలా ఉన్నా పాటల్లో మాత్రం కాంప్రమైజ్ అయినట్టు లేదు.
అలాగే తెలుగమ్మాయ్ తేజస్వి కూడా హెబ్బాకి గట్టి పోటీనే ఇచ్చినట్టుంది. రామ్ గోపాల్ వర్మ తీసిన ఐస్ క్రీమ్ మూవీలో స్కిన్ షో విషయంలో మాములు రచ్చ చేయలేదు తేజస్వి. తెలుగమ్మాయ్ కి ఎంత గట్స్ అనుకునే రేంజ్ లో షాకిచ్చింది. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా ఇంకాస్త రెచ్చిపోయినట్టుంది. ఆడియో రిలీజ్ అంటూ వేసిన పోస్టర్స్ లోనే వీళ్లూ ఇలా హాట్ లుక్స్ లో చంపేస్తే స్క్రీన్ మీద అరుపులు పుట్టిస్తారేమో. మరి ఆడియెన్స్ కి వీళ్ల అందాలు ఎంత మత్తు ఇస్తాయో సినిమా చూస్తే తేలిపోతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/