Begin typing your search above and press return to search.
బాయ్ ఫ్రెండ్స్ భామ.. బాగా పుంజుకుంది
By: Tupaki Desk | 22 Dec 2016 11:30 AM GMTహెబ్బా పటేల్ లక్కు మామూలుగా లేదు. ఇప్పటికే ఓ హ్యాట్రిక్ కొట్టేసి.. ఇప్పుడు ఏకంగా లీడ్ రోల్ లో సినిమా చేసేసి మరీ ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' అంటూ ఈ కుమారి నటించిన సినిమా గత వారం రిలీజ్ కాగా.. మొదట్లో టాక్ కాస్త అటూఇటూగా వినిపించింది. కానీ రెండో రోజు నుంచి ఈ సినిమాకి వసూళ్లు పుంజుకున్న తీరు ట్రేడ్ జనాలకు షాక్ తగిలించేసింది.
బాయ్ ఫ్రెండ్స్ తో హెబ్బా రచ్చ థియేటర్లలోకి వచ్చి దాదాపు వారం పూర్తి కావచ్చింది. ఇప్పటివరకూ ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా? అక్షరాలా ఐదు కోట్ల రూపాయలను మించి రాబట్టేసిందట నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఈ మూవీకి మొత్తం పెట్టిన బడ్జెట్ 2.5 కోట్లు మాత్రమే కావడంతో.. ఇప్పటికే అందరూ సేఫ్ జోన్ లోకే కాదు ప్రాఫిట్స్ లోకి కూడా వచ్చేశారు. అన్ని ఏరియాల్లోను ఇదే సిట్యుయేషన్. ఇంతగా మొదటివారం ముగిసేలోపే మూవీలో ఇన్వాల్వ్ అయిన అన్ని వర్గాలకు ప్రాఫిట్స్ పంచిన రికార్డ్ హెబ్బాకి దక్కేసింది.
ఇంకా మంచి వసూళ్లతో నడుస్తుండడం.. మరో వారం పాటు చెప్పుకోదగిన సంఖ్యలోనే థియేటర్లను నిలబెట్టుకోనుండడంతో.. హెబ్బా పటేల్ కి గోల్డెన్ లెగ్ అనే స్టాంప్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతోంది. ఈడో రకం ఆడో రకం.. ఎక్కడికి పోతావు చిన్నవాడా.. ఇప్పుడు నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ తో కలిపి.. 2016లోనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసింది హెబ్బా పటేల్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/