Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: బాయ్ ఫ్రెండ్స్ తో టీజర్ అదిరే

By:  Tupaki Desk   |   3 Dec 2016 11:16 AM GMT
ట్రైలర్ టాక్: బాయ్ ఫ్రెండ్స్ తో టీజర్ అదిరే
X
వరుస హిట్స్ తో జోరుమీదున్న కుమారి హేభా పటేల్ లేటెస్ట్ మూవీ 'నాన్న.. నేను.. నా బాయ్ ఫ్రెండ్స్.' మాంచి స్పీడ్ మీద ఉన్న హేభ హీరోయిన్ కావడంతో.. టాలీవుడ్ లో ఈ మూవీ పై మంచి బజ్ నెలకొంది. పేరులోనే దాదాపు స్టోరీ ఏంటో అర్ధమయిపోతుండగా.. గత నెలలో రిలీజ్ చేసిన ట్రైలర్ లో కన్ఫ్యూజన్ లేకుండా కథ చెప్పేశారు.

ఇప్పుడు 'నాన్న.. నేను.. నా బాయ్ ఫ్రెండ్స్' మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు నిర్మాతలు. 'అరేంజ్డ్ మ్యారేజ్ అంటే టెక్ట్స్ బుక్.. అక్కడున్నదే చదవాలి. అదే లవ్ మ్యారేజ్ అయితే నోట్ బుక్.. నచ్చింది రాస్కోవచ్చు' అంటూ తేజస్వి మదివాడతో హేభాపటేల్ కు చెప్పించిన డైలాగ్.. మూవీ మొత్తానికి మూలం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు.. ముగ్గురు అబ్బాయిలను ప్రేమించానని చెబితే ఆ తండ్రి పాత్ర పడిన వేదనను.. రావు రమేష్ కళ్లకు కట్టేశాడు. ఇక ముగ్గరబ్బాయిలతోను లవ్ కాన్సెప్ట్ ను బాగా ఫన్నీగా తెరకెక్కించే ప్రయత్నం జరిగింది. ముగ్గురినీ హీరోయిన్ ప్రేమిస్తున్నట్లు ముగ్గురికీ తెలియడం అసలు హైలైట్ గా చెప్పచ్చు.

టీజర్ లో చెప్పిన విషయాన్నే ట్రైలర్ లో మరింత డీటైల్డ్ గా చెప్పారంతే. అయితే.. లవ్ స్టోరీల కోసం సిటీస్ ని.. సెంటిమెంట్ కోసం పల్లెటూరి వాతావరణాన్ని ఉపయోగించుకోవడం బాగుంది. కథ.. కథనం తెలిసిపోతోంది కాబట్టి.. కథను దర్శకుడు భాస్కర్ బండి ఎలా పిక్చరైజ్ చేశాడన్నదే మూవీకి కీలకం. ట్రైలర్ ప్రామిసింగ్ గానే ఉంది కాబట్టి.. హిట్టు పట్టాలు ఎక్కడం కష్టం కాకపోవచ్చు. డిసెంబర్ 16న ఈ 'నాన్న.. నేను.. నా బాయ్ ఫ్రెండ్స్' ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.