Begin typing your search above and press return to search.

‘నాన్నకు ప్రేమతో’ పోస్టర్ పై కొత్త రగడ

By:  Tupaki Desk   |   10 Jan 2016 4:26 AM GMT
‘నాన్నకు ప్రేమతో’ పోస్టర్ పై కొత్త రగడ
X
జూనియర్ కు కొత్త తలనొప్పి మొదలైంది. ‘బాబాయ్ – అబ్బాయ్’ ఫైలింగ్ అంటూ ప్రచారం ఒకపక్క.. మరోపక్క కొన్ని మీడియాలో వీరిమధ్య మరింత దూరం పెంచేలా వార్తలు (మొదటి పేజీలో) వచ్చేస్తున్న వేళ జూనియర్ తెగ వర్రీ అయిపోతున్నారు. మాంచి హిట్ కోసం కసిగా ఎదురుచూస్తూ.. ‘నాన్నకు ప్రేమతో’ మీద బోలెడన్ని ఆశలతో వస్తున్న వేళ.. ఊహించని వివాదంలో సినిమా ఇరుక్కోవటం తాజా పరిణామం.

తాజా ఇష్యూకు చిత్ర పోస్టర్ కారణంగా మారింది. చిత్రంలోని ఓ పాట సందర్భంగా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఫోటోల ముందు హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ అభ్యంతరకర దుస్తులతో స్టెప్పులేస్తున్నారంటూ మైనారిటీ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీస్ కమిషనర్.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

కొందరి మనోభావాలు దెబ్బ తీసేలా పోస్టర్ ఉందంటూ రెండు తెలుగు రాష్ట్రాల మైనారిటీ కమిషన్ లో ఫిర్యాదు దాఖలు కావటం గమనార్హం. మతపరమైన ప్రవచనాల నేపథ్యంలో హీరోయిన్ అభ్యంతరకర దుస్తుల్లో ఉండటాన్ని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం.. అనుకోని విధంగా మతపరమైన వివాదంలో ఇరుక్కుపోవటం జూనియర్ అండ్ కోకు షాకింగే.